News February 5, 2025
గచ్చిబౌలిలో విషాదం.. యువతి సూసైడ్
గచ్చిబౌలి సిద్దిక్నగర్లో బుధవారం విషాద ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. ఓ హాస్టల్ పై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు రిటోజా బసు(22)గా గుర్తించారు. అనారోగ్య సమస్యలతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 5, 2025
WGL: విషాదం.. గుండెపోటుతో యువకుడు మృతి
వరంగల్ జిల్లాలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈరోజు ఉదయం ఓ యువకుడు హార్ట్ ఎటాక్తో మరణించాడు. నగరంలోని డాక్టర్స్ కాలనీకి చెందిన కుమారస్వామి(33) ఈరోజు ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, 3 నెలల పాప ఉంది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
News February 5, 2025
రైతులకు కనీస మద్దతు ధర లభించేలా పర్యవేక్షించాలి: కలెక్టర్
నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ బుధవారం ఆయన కార్యాలయంలో వ్యవసాయం అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లా వ్యాప్తంగా త్వరలో మొదలుకానున్న ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర దక్కేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు.
News February 5, 2025
గుల్లకోటల: బావిలో పడి బాలుడి మృతి
ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో 3 సంవత్సరాల బాలుడు ప్రమాదవశాత్తు చేద బావిలో పడి బుధవారం మృతిచెందాడు. మంత్రి రంజిత్, శిరీష దంపతుల చిన్న కుమారుడు లడ్డు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి తల్లిదండ్రుల ఇంటి వెనకాల వాళ్ల అమ్మమ్మ ఇల్లు ఉంటుందని, రెండిళ్ల మధ్యలో చేద బావి ఉంటుందని, బాలుడు కనిపించకపోవడంతో బావిలో పడి ఉండటం చూసి బయటకు తీసి ధర్మారం ఆస్పత్రికి తీసుకుపోగా అప్పటికే బాలుడు మృతి చెందాడు.