News November 7, 2024
గచ్చిబౌలి: క్రీడా శిక్షణ శిబిరంగా మారునున్న TIMS
రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో TIMS ప్రాంగణాన్ని క్రీడాకారుల గురుకుల శిక్షణ శిబిరం, స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సుగా మార్చనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. 2002లో ప్రారంభమైన GMC బాలయోగి స్టేడియం,మళ్లీ క్రీడల కోసం నూతన పుంతలు తొక్కనుంది.
Similar News
News December 7, 2024
సరూర్‌నగర్ BJP సభ (అప్‌డేట్స్)
సరూర్‌నగర్ సభ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపామని BJP నేతలు పేర్కొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, BJP ఎమ్మెల్యేలు, హైదరాబాద్, రంగారెడ్డికి చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రజల పక్షాణ BJP నిరంతరం పోరాటం చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు.
News December 7, 2024
ఖైరతాబాద్: తెలంగాణ తల్లి విగ్రహ అవిష్కరణ.. కేంద్రమంత్రికి ఆహ్వానం
రాజ్‌భవన్ దిల్ కుశా గెస్ట్‌హౌస్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. ఈ సందర్భంగా ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకూ రావాలన్నారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు పొన్నం తెలిపారు.
News December 7, 2024
HYD: డ్రగ్స్, సైబర్ కేసుల్లో కఠిన శిక్ష పడేలా చర్యలు: CM
హైదరాబాద్‌లో డ్రగ్స్, సైబర్ మహమ్మారి చేప కింద నీరులా విస్తరిస్తన్న నేపథ్యంలో డ్రగ్స్ నిరోధించడంలో కొంత ప్రగతి సాధించినప్పటికీ అది సరిపోదని, మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. న్యాయస్థానాల్లో కఠిన శిక్ష పడేలా స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేసి, నిపుణులైన అధికారులను నియమించాలన్నారు. ఈ కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.