News March 27, 2025
గచ్చిబౌలి: నేడు కరాటే పోటీలు.. Dy CM రాక

గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నేటి నుంచి 4వ కేఐఓ జాతీయ కరాటే ఛాంపియన్ షిప్-2025 పోటీలు నిర్వహిస్తున్నామని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో దేశం నలుమూలల నుంచి సుమారు 1,500 మంది క్రీడాకారులు పాల్గొంటారన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరై ఈ పోటీలను ప్రారంభిస్తారన్నారు.
Similar News
News December 5, 2025
బెంజ్, రేంజ్ రోవర్ కాకుండా ఫార్చునర్.. అందుకేనా?

నిన్న మోదీ, పుతిన్ టయోటా ఫార్చునర్ కారులో ప్రయాణించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. రేంజ్ రోవర్, బెంజ్ లాంటి లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ వారు ఫార్చునర్‌లోనే ప్రయాణించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా 2022లో అమెరికాతో పాటు యూరప్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో ఆ దేశాల కార్లు కాకుండా జపాన్‌కు చెందిన టయోటాను ఎంచుకుని మోదీ, పుతిన్ వారికి బలమైన సందేశం పంపినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.
News December 5, 2025
పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్, ఎస్పీ

రెంటచింతల మండలం మంచికల్లు గ్రామంలో కొలువై ఉన్న గ్రామ దేవత పోలేరమ్మ అమ్మవారిని కలెక్టర్ కృతికా శుక్ల, ఎస్పీ కృష్ణారావు దర్శించుకున్నారు. తిరునాళ్ల సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్నాటి కోనసీమగా పిలువబడే మంచికల్లులో ఎన్నో సంవత్సరాలుగా ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో గురజాల, మాచర్ల ఎమ్మెల్యేలు, డీఎస్పీ, తదితరులు పాల్గొన్నారు.
News December 5, 2025
1967 నుంచి పాతలింగాలలో ఏకగ్రీవ పరంపర

ఖమ్మం: దివంగత నేత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి స్వగ్రామమైన కామేపల్లి మండలం పాతలింగాలలో 50 ఏళ్లుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగలేదు. 1967లో వెంకటరెడ్డి సర్పంచ్‌గా గెలిచిన నాటి నుంచి నేటి వరకు ఈ గ్రామం ఏకగ్రీవ పరంపరను కొనసాగిస్తోంది. ప్రస్తుతం రాంరెడ్డి గోపాల్‌రెడ్డి నేతృత్వంలో గ్రామ పెద్దల సహకారంతో సమస్యలు పరిష్కరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.


