News February 26, 2026
గచ్చిబౌలి: మనూలో దరఖాస్తుల ఆహ్వానం

గచ్చిబౌలిలోని మనూలో బీఏ, బీఈడీ, బీఎస్సీ బీఈడీ, బీకామ్ బీఈడీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎన్సీఈటీ)లో వచ్చిన స్కోర్ల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తామని మనూ అడ్మిషన్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ ప్రొ.వనజ తెలిపారు. ఆసక్తిగలవారు మార్చి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.
Similar News
News April 18, 2026
KPHBలో తృటిలో తప్పిన పెను ప్రమాదం!

KPHB మెట్రో పిల్లర్ నంబర్ A-834 వద్ద శుక్రవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. గచ్చిబౌలి నుంచి పాలకొల్లు వెళ్తున్న ఈ బస్సులో 18 మంది ప్రయాణికులు ఉండగా, అప్రమత్తతతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. అధికారులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.

సభకు నేనొచ్చా.. వాళ్లు రాలేదు: రాఘవ్ చడ్ఢా

రాజ్యసభకు గైర్హాజరైన సొంత పార్టీ నేతలపై ఎంపీ రాఘవ్ చడ్ఢా విమర్శలు చేశారు. ‘మా పార్టీ సభా పక్షనేత ఇక్కడ లేరు. కొత్తగా నియమితులైన డిప్యూటీ లీడర్ కూడా రాలేదు. నన్ను డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఇటీవల తొలగించారు. నేను సభకు వచ్చాను. మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు థాంక్స్’ అని అన్నారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా మరోసారి నియమితులైన హరివంశ్ సింగ్‌కు అభినందనలు తెలిపారు.