News April 6, 2024
గజపతినగరంలో అతనొక్కడే ఏకగ్రీవం

గజపతినగరం నియోజకవర్గంలో ఏకగ్రీవంగా గెలిచిన ఒకే ఒక్కరు పెనుమత్స సాంబశివరాజు. ఈయన గజపతినగరం నుంచి 1967లో ఇండిపెండెంట్గా గెలిచి తొలిసారి అసెంబ్లీకి వెళ్లారు. 1972లో ఆయనకి ప్రత్యర్థి లేకపోవడంతో విజయం ఏకగ్రీవం అయ్యింది. 1978 నుంచి 2004 వరకు అప్పటి సతివాడ నియోజకవర్గం నుంచి 7సార్లు పోటీ చేయగా.. 1994 మినహా మిగిలిన 6 సార్లు విజయం సాధించారు. ఈయన వారసుడు సురేశ్ ఇప్పడు వైసీపీ నుంచి MLCగా కొనసాగుతున్నారు.
Similar News
News October 24, 2025
మత్స్యకారులను సురక్షితంగా రప్పిస్తాం: మంత్రి కొండపల్లి

బంగ్లాదేశ్లో బందీలుగా ఉన్న జిల్లా మత్స్యకారులను విడిపించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు ప్రారంభించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి వివరాలు సేకరించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు పంపించామని చెప్పారు. APNRT, భారత హైకమిషన్ ద్వారా కూడా చర్యలు కొనసాగుతున్నాయని, మత్స్యకారులను త్వరలో సురక్షితంగా రప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
News October 24, 2025
మత్స్యకారులను రప్పించేందుకు చర్యలు వేగవంతం: కలెక్టర్

బంగ్లాదేశ్ చెరలో చిక్కుకున్న విజయనగరం జిల్లా మత్స్యకారులను సురక్షితంగా రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ, ఢాకాలోని భారత హైకమిషన్తో నిరంతర సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్ ద్వారా అధికారిక చర్చలు కొనసాగుతున్నాయన్నారు.
News October 23, 2025
ఆండ్ర రిజర్వాయర్ నుంచి నీరు విడుదల

ఆండ్ర జలాశయంలోకి గురువారం సాయంత్రం ఇన్ ఫ్లో 750 క్యూసెక్కుల వరద నీరు రావడంతో స్పిల్వే రెండో గేట్ ద్వారా 400 క్యూసెక్కుల నీటిని చంపావతి నదిలోకి విడుదల చేశామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. చంపావతి నది పరివాహక ప్రాంతాలైన అనంతగిరి, మెంటాడ మండలంలో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయంలో నీటి మట్టం పెరిగిందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


