News April 24, 2024

గజపతినగరంలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. లారీ పక్క నుంచి స్కూటీపై వెళ్తూ అదుపు తప్పడంతో లారీ వెనుక చక్రం కింద పడి ఘటనా స్థలంలోనే మరణించాడు. గజపతినగరం ఎస్సై యు.మహేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 31, 2025

VZM: రీసర్వే గ్రామాల్లో కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

image

జిల్లాలో రీసర్వే పూర్తైన గ్రామాల్లో రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. జనవరి 2 నుంచి 9 వరుకు అన్ని మండలాల్లో ముందుగా నిర్ణయించిన గ్రామాల్లో రెవెన్యూ గ్రామ సభల ద్వారా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పాసు పుస్తకాలు అందజేస్తామని పేర్కొన్నారు. రీసర్వే పూర్తైన గ్రామాల రైతులు గ్రామ సభలకు హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

News December 31, 2025

కుమ్మపల్లిలో యాక్సిడెంట్..ఓ వ్యక్తి స్పాట్ డెడ్

image

వేపాడ మండలం కుమ్మపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. దేవరాపల్లి మండలం ముత్యాలమ్మ పాలెంకు చెందిన చౌడువాడ దేవుడు నాయుడు బుధవారం తన స్నేహితుడు మహేష్‌తో కలసి బైక్‌పై కుమ్మపల్లి వెళుతుండగా రోడ్డు మలుపులో బైక్ అదుపుతప్పి కింద పడ్డారు. ప్రమాదంలో గాయపడిన చౌడు నాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 31, 2025

VZM: ముమ్మరంగా వాహన తనిఖీలు

image

ఇవాళ రాత్రి 7 గంటల నుంచి విజయనగరంలోని 150 ప్రాంతాల్లో సుమారు 1,000 మంది పోలీసు సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహించనున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రజల భద్రత, రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు ఈ తనిఖీలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుపడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.