News April 24, 2024

గజపతినగరంలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. లారీ పక్క నుంచి స్కూటీపై వెళ్తూ అదుపు తప్పడంతో లారీ వెనుక చక్రం కింద పడి ఘటనా స్థలంలోనే మరణించాడు. గజపతినగరం ఎస్సై యు.మహేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 12, 2026

విజయనగరం: పెట్రోలో కావలంటే..హెల్మెట్ ధరించాల్సిందే!

image

రహదారి భద్రతా నియమాల్లో భాగంగా రోడ్డు ప్రమాదాలు నివారించుటకు త్వరలో “నో హెల్మెట్ – నో పెట్రోల్ “ అనే నినాదాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తామని ఎస్పీ దామోదర్ తెలిపారు. పట్టణంలో బుధవారం జరిగిన వాహన తనిఖీలను పరిశీలించారు. హెల్మెట్ లేని కారణంగా ప్రాణాలు పోతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ బాధితులను గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి చేర్చిన వారికి రూ.5,000 ప్రోత్సాహకం ఉంటుందని స్పష్టం చేశారు.

News February 12, 2026

రీసర్వే, పాస్‌పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి: జేసీ

image

రీసర్వే పనులు, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన వీసీలో రీస‌ర్వే, ప‌ట్టాదారు పాసుపుస్త‌కాల పంపిణీని స‌మీక్షించారు. పెండింగ్ ఖాతాలు త్వరగా క్లియర్ చేసి, మ్యూటేషన్లు వేగంగా చేయాలన్నారు. ఫిబ్ర‌వ‌రి నెల‌కు సంబంధించి ఇంకా 4,765 ఖాతాలు పెండింగ్ ఉండ‌టం ప‌ట్ల అసంతృప్తిని వ్య‌క్తం చేశారు.