News April 24, 2024
గజపతినగరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మార్పు

గజపతినగరం అభ్యర్థిగా కురిమి నాయుడు స్థానంలో దోలా శ్రీనివాస్‌ను కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించింది. అటు బొబ్బిలి అభ్యర్థిగా మరిపి విద్యాసాగర్, నెల్లిమర్ల నుంచి ఎస్.రమేశ్ కుమార్ బరిలో ఉంటారని కాంగ్రెస్ తెలిపింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
Similar News
News January 16, 2026
విజయనగరంలో కేజీ చికెన్ రూ.240

నేడు కనుమ పండగ సందర్భంగా మాంసం ప్రియులకు తిందాం అని ఉన్నా శుక్రవారం సెంటిమెంట్‌తో ఎవరూ కొనుగోలు చేయడం లేదు. దీంతో చికెన్, మటన్ షాపులు కొనుగోళ్లు లేక వెలవెలబోతున్నాయి. కాగా నగరంలో మటన్ కేజీ రూ.900 వరకు పలుకుతుండగా.. చికెన్ (స్కిన్) రూ.260, స్కిన్ లెస్ రూ.240, రొయ్యలు రూ.350/250, చేపలు రూ.170 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.
News January 16, 2026
సింహాచలంలో 18న అప్పన్న తెప్పోత్సవం

వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి తెప్పోత్సవం ఈ నెల 18న (ఆదివారం) వరాహ పుష్కరిణిలో వైభవంగా జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు కొండపై నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. అనంతరం గ్రామ తిరువీధి ఉత్సవం జరగనుంది. ఉత్సవం కారణంగా ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకే భక్తులకు స్వామివారి దర్శనం లభిస్తుందని ఆలయ అధికారులు తెలిపారు.