News January 24, 2025

గజపతినగరం: మంత్రి కొండపల్లి రేపటి షెడ్యూల్ ఇదే

image

రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం నాటి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 8 గంటలకు గజపతినగరం టీడీపీ కార్యాలయంలో దత్తిరాజేరు నాయకులతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 2:00 గంటలకు దత్తిరాజేరు MPDO కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 3:30 గంటలకు చామలవలస గ్రామంలో పర్యటించి సాయంత్రం 5 గంటలకు విశాఖ వెళ్తారని మంత్రి కార్యాలయం తెలిపింది.

Similar News

News December 5, 2025

విజయనగరం జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభ‌విస్తే చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో ఎక్క‌డైనా మాతృ, శిశు మ‌ర‌ణాలు సంభ‌విస్తే స‌హించేది లేదని జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. కలెక్టరేట్‌లోని DRC సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్షేత్ర‌స్థాయిలో అత్యున్న‌త ప్ర‌భుత్వ యంత్రాగం ఉంద‌ని, ప్ర‌భుత్వం మంచి పోష‌కాహారాన్ని స‌ర‌ఫ‌రా చేస్తోంద‌ని, అయిన‌ప్ప‌టికీ అక్క‌డ‌క్క‌డా మాతృ, శిశు మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఇక‌ముందు జ‌రిగితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చరించారు.

News December 5, 2025

విజయనగరంలో డిగ్రీ విద్యార్థి సూసైడ్

image

విజయనగరంలోని స్థానిక ప్రభుత్వ బీసీ వసతి గృహంలో ఓ విద్యార్థిని గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మహారాజా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న స్వాతిగా పోలీసులు గుర్తించారు. ఈమె స్వస్థలం శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంగా తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

News December 4, 2025

VZM: జిల్లా వ్యాప్తంగా రేపు మెగా పేరెంట్-టీచర్ మీట్

image

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మెగా పేరెంట్-టీచర్ మీట్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, నైపుణ్యాలు, పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై తల్లిదండ్రులతో చర్చించనున్నట్లు చెప్పారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పలు పాఠశాలల్లో పాల్గొననున్నారని, తల్లిదండ్రులు తప్పనిసరిగా పాల్గొని పిల్లల భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాములవ్వాలన్నారు.