News June 19, 2024

గజపతిరాజు జ్ఞానం స్ఫూర్తినిస్తుంది: మంత్రి రామ్మోహన్

image

కేంద్ర పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును అదే శాఖకు నియమితులైన రామ్మోహన్నాయుడు బుధవారం విజయనగరంలోని గజపతిరాజు బంగ్లాలో కలిశారు. ఈ సందర్భంగా శాఖకు సంబంధించిన అంశాలు చర్చించారు. ఆయనను కలవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ X (ట్విటర్) ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు. గజపతిరాజు సలహాలు, మద్దతు వెలకట్టలేనివని, ఆయన జ్ఞానం ఎప్పుడూ తనకు స్ఫూర్తినిస్తుందని ట్వీట్ చేశారు.

Similar News

News December 4, 2025

మూలపేట పొర్టు నిర్మాణంపై అప్‌డేట్

image

టెక్కలి నియోజకవర్గం మూలపేట పోర్టు నిర్మాణం జాప్యం అవుతోంది. దీని వ్యవధిని 2026 నవంబర్‌కు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు రూ. 2949.70 కోట్లతో విశ్వసముద్ర పోర్టు కాంట్రాక్ట్ సంస్థ పనులను 2023 ఏప్రిల్‌లో ప్రారంభించింది. కాంట్రాక్టర్ గడువు ఈ ఏడాది అక్టోబర్ 17తో ముగిసింది. పెండింగ్ పనుల దృష్ట్యా కట్టడాల కాలపరిమితిని పెంచుతూ తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

News December 4, 2025

ఎచ్చెర్ల: రిజల్ట్స్ వచ్చాయి

image

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ LLB 2, 4, 6, 8, 10వ సెమిస్టర్ల పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ ఉదయ్ భాస్కర్ బుధవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రిజల్ట్స్‌ను అధికారిక వెబ్ సైట్‌ https://brau.edu.in/లో పొందుపరిచామన్నారు. 95 మందికి 84 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.

News December 4, 2025

గర్భస్థ లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం: DM&HO

image

గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని DM &HO అనిత స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం లింగ ఆధారిత హింస నివారణ, మెడికో లీగల్ కేర్‌పై శిక్షణ కార్యక్రమం జరిగింది. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న హింసలను అరికట్టి, లింగ వివక్ష చూపరాదని డీఎంహెచ్వో తెలియజేశారు.