News June 19, 2024
గజపతిరాజు జ్ఞానం స్ఫూర్తినిస్తుంది: మంత్రి రామ్మోహన్

కేంద్ర పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును అదే శాఖకు నియమితులైన రామ్మోహన్నాయుడు బుధవారం విజయనగరంలోని గజపతిరాజు బంగ్లాలో కలిశారు. ఈ సందర్భంగా శాఖకు సంబంధించిన అంశాలు చర్చించారు. ఆయనను కలవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ X (ట్విటర్) ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు. గజపతిరాజు సలహాలు, మద్దతు వెలకట్టలేనివని, ఆయన జ్ఞానం ఎప్పుడూ తనకు స్ఫూర్తినిస్తుందని ట్వీట్ చేశారు.
Similar News
News July 9, 2025
రేపు జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీలు

శ్రీకాకుళం జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీలను రేపు కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి బి.లక్ష్మణ్ దేవ్ ప్రకటించారు. ఆండర్-13, 14 విభాగాల్లో సత్తాచాటిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. 2011-12 సంవత్సరాల మధ్య జన్మించిన క్రీడాకారులు పోటీలకు అర్హులని తెలిపారు.
News July 9, 2025
కిక్కిరిసిన పలాస-ఆమదాలవలస ట్రైన్

పలాస-ఆమదాలవలస ప్యాసింజర్ రైలు బుధవారం ప్రయాణికులతో సంద్రాన్ని తలపించింది. సింహాచలం గిరి ప్రదర్శన సందర్భంగా లక్షలాది మంది ప్రజలు సింహాచలం తరలి రావడంతో రైలు ప్రయాణికులతో కిటకిటలాడింది. ట్రైన్లో కనీసం కాలు పెట్టుకునేందుకు కూడా చోటు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డామన్నారు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వం స్పెషల్ ట్రైన్స్ వేయాలని కోరారు.
News July 9, 2025
శ్రీకాకుళం: 22 పీఏసీఎస్ సంఘాలకు ఛైర్మన్ల నియామకం

శ్రీకాకుళం జిల్లాలో 22 పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు)కు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలో 36 పీఏసీఎస్ సంఘాలు ఉండగా 22 పీఏసీఎస్ సంఘాలకు ఛైర్మన్ల నియామకం పూర్తయింది. వీరు వచ్చే ఏడాది జూలై 30వ తేదీ వరకు కొనసాగుతారు. ఒక పీఏసీఎస్ సంఘానికి ఛైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను నియమించారు.