News October 7, 2024

గజ్వేల్‌లో కేసీఆర్ చిత్రపటానికి వినతిపత్రం

image

గజ్వేల్ ఎమ్మెల్యే ఆఫీసును కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించారు. నియోజకవర్గంలో చాలా రోజులుగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఏఎంసీ ఛైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. చెక్కుల పంపిణీ చేయాలని సహకారం ఇవ్వాలని కోరుతూ.. కేసీఆర్ చిత్రపటానికి వినతిపత్రం ఇచ్చారు. వైస్ ఛైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ భాస్కర్ తదితరులు ఉన్నారు.

Similar News

News October 14, 2025

మెదక్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

image

మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాసరావును ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే రక్తదాన శిబిరంపై చర్చించారు. పోలీస్ హెడ్ క్వార్టర్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

News October 14, 2025

రామాయంపేట: ‘ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలి’

image

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. రామాయంపేట మండలం కోనాపూర్‌లో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం నిర్మాణం చేపడితే సకాలంలో బిల్లులు చెల్లిస్తామని పేర్కొన్నారు.

News October 14, 2025

రామాయంపేట: గిట్టుబాటు ధర కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు

image

రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రామాయంపేట మండలం కోనాపూర్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలన్నారు.