News February 7, 2025
గజ్వేల్‌లో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల విలీనం

మల్లన్న సాగర్ ముంపుకు గురైన 7 గ్రామాలను గజ్వేల్ మున్సిపాలిటీలో విలీనమైనట్లే అని డీపీవో జానకీదేవి తెలిపారు. తొగుట మండలంలోని 5, కొండపాక మండలంలోని 2 గ్రామాలు ముంపునకు గురి కాగా గజ్వేల్ పరిధిలో ఆర్‌అండ్ ఆర్ కాలనీని నిర్మించి 4ఏళ్ల క్రితం నిర్వాసితులను తరలించారు. ఈ 7గ్రామాల పరిధిలో 15 వేల జనాభా ఉండగా, ఏడు వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. తాజాగా గజ్వేల్ గ్రేడ్ మారడంతోపాటు వార్డుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది.
Similar News
News March 22, 2025
భార్య నుంచి ఆ కాల్ వస్తే చాలా టెన్షన్: అభిషేక్ బచ్చన్

‘ఐ వాంట్ టు టాక్’ అనే సినిమాకు ‘ఉత్తమ నటుడు’ పురస్కారం అందుకున్న సందర్భంగా నటుడు అభిషేక్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఐ వాంట్ టు టాక్’ అని ఎవరి కాల్ వస్తే మీరు టెన్షన్ పడతారంటూ హోస్ట్ అర్జున్ కపూర్ ప్రశ్నించగా.. తన భార్య నుంచి ఆ కాల్ వస్తే సమస్యలో పడ్డట్లేనని అభిషేక్ జవాబిచ్చారు. ఐష్, అభిషేక్ విడిపోనున్నారని గత కొంతకాలంగా వార్తలు హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
News March 22, 2025
సిరిసిల్ల జిల్లాలో ఎండలు కొడుతూనే వర్షాలు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకవైపు ఎండలు కొడుతూనే మరోవైపు పలు మండలాలలో వర్షాలు కురిశాయి. గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఇలా నమోదు అయ్యాయి. వీర్నపల్లి 37.6°c, ఇల్లంతకుంట 37.6°c, తంగళ్ళపల్లి 37.5°c, గంభీరావుపేట 37.5°c, సిరిసిల్ల 37.4 °c,చందుర్తి 37.2°c, వేములవాడ 37.1°c, ఎల్లారెడ్డిపేట 35.8 °c లుగా నమోదు అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
News March 22, 2025
భద్రాద్రి: తండ్రి మరణం.. ఆ ఇద్దరు బిడ్డలకు ‘పరీక్ష’

ఓ వైపు తండ్రి మరణం.. మరో వైపు ‘పది’ పరీక్షలు. ఆ పుట్టెడు దుఃఖంలో పరీక్ష రాశారు ఇల్లందు మండలం కల్తిరామయ్యగుంపు గ్రామానికి చెందిన బి.వీరాస్వామి కుమార్తెలు. వీరాస్వామి గురువారం అనారోగ్యంతో మృతి చెందగా, మరణ వార్త దిగమింగుకొని పదో తరగతి పరీక్షలు రాశారు హర్షిత, ప్రియ. పరీక్ష అనంతరం తండ్రిని కడసారి చూసిన కుమార్తెలు విలపిస్తున్న దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది. దుఃఖంలోనూ పరీక్ష రాసిన వారు గ్రేట్ కదా..!