News February 6, 2025

గజ్వేల్‌లో KCR రాజీనామా చేయాలా.. వద్దా..?: (VIRAL)

image

GHMC కార్పొరేటర్ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి‌ BRS తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. ‘అసెంబ్లీకి రాని, ప్రజల సమస్యలు పట్టించుకోని KCR గారు గజ్వేల్ MLAగా రాజీనామా చేయాలా..? వద్దా..?’ అని ప్రశ్నించారు. దీనిపై ఇరు పార్టీల సోషల్ యాక్టివిస్ట్‌‌లు స్పందించారు. నిజమే అని BJP శ్రేణులు.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఏంటని BRS నేతలు పోటీ పడటం గమనార్హం.

Similar News

News December 24, 2025

NTR: ఆంధ్ర టాక్సీ స్పందన కరవు.. ఆసక్తి లేదా..?

image

జిల్లాలో ఈ నెల 25 నుంచి ఆంధ్ర టాక్సీ యాప్ అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు కేవలం 150 మంది డ్రైవర్లు మాత్రమే పేర్లు నమోదు చేసుకోవడం గమనార్హం. మొదటి నెల ఉచితంగా ఇచ్చి, ఆ తర్వాత 5% కమిషన్ వసూలు చేయనున్నారు. ప్రభుత్వం ఈ యాప్‌ను ప్రమోట్ చేస్తూనే, పర్యాటక ప్యాకేజీలను కూడా చేర్చింది. ప్రైవేట్ యాప్‌కు ప్రభుత్వం ఇంతగా మద్దతు ఇవ్వడంపై విమర్శలు వస్తుండగా, డ్రైవర్లు మాత్రం నమోదుకు అంతగా ఆసక్తి చూపడం లేదు.

News December 24, 2025

ఫలించిన సునీల్ గవాస్కర్ పోరాటం

image

మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పోరాటం ఫలించింది. తన పేరు, ఫొటోలు, వాయిస్‌ను అనుమతి లేకుండా వాడకూడదంటూ ఢిల్లీ హైకోర్టు నుంచి <<18640617>>పర్సనాలిటీ రైట్స్<<>> పొందిన తొలి భారత క్రీడాకారుడిగా నిలిచారు. గవాస్కర్ పేరు, ఫొటోలను తప్పుగా ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. అనుమతి లేని పోస్టులు, వీడియోలను 72 గంటల్లో తొలగించాలని కోర్టు ఆదేశించింది. గతంలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ వంటి వారు ఈ రైట్స్ పొందారు.

News December 24, 2025

విశాఖలో 16వ శతాబ్ధం నాటి ఆనవాళ్లు!

image

విశాఖ మధురవాడ 7వ వార్డు పరిధి సుద్దగెడ్డ సమీపంలో టిడ్కో గృహాల వద్ద రహదారి విస్తరణ పనుల్లో బయటపడ్డ శ్రీరాముడి విగ్రహాన్ని పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.ఫాల్గుణ రావు ఆధ్వర్యంలో బృందం స్థలాన్ని పరిశీలించి, ఈ విగ్రహం పురాతన రాతితో తయారైనదిగా, శైలి ఆధారంగా 16వ శతాబ్దానికి చెందినదిగా నిర్ధారించారు. మిగతా భాగం రాముని విగ్రహాలు కూడా ఇక్కడే ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.