News February 6, 2025

గజ్వేల్‌లో KCR రాజీనామా చేయాలా.. వద్దా..?: (VIRAL)

image

GHMC కార్పొరేటర్ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి‌ BRS తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. ‘అసెంబ్లీకి రాని, ప్రజల సమస్యలు పట్టించుకోని KCR గారు గజ్వేల్ MLAగా రాజీనామా రాజీనామా చేయాలా..? వద్దా..?’ అని ప్రశ్నించారు. దీనిపై ఇరు పార్టీల సోషల్ యాక్టివిస్ట్‌‌లు స్పందించారు. నిజమే అని BJP శ్రేణులు.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఏంటని BRS నేతలు పోటీ పడటం గమనార్హం.

Similar News

News October 18, 2025

KMR: దీపావళి సేఫ్‌గా చేసుకోండి: SP

image

దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు బాణాసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని KMR SP రాజేష్ చంద్ర సూచించారు. అలాగే జిల్లాలో జూదంపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందన్నారు. ఎవరైనా జూదం ఆడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రౌడీలు, అనుమానితులపై నిరంతర పర్యవేక్షణ ఉంచి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలతో కట్టడి చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.

News October 18, 2025

పాక్ దాడుల్లో 8 మంది అప్గాన్ క్రికెటర్లు మృతి!

image

పాక్ జరిపిన వైమానిక దాడుల్లో అప్గానిస్థాన్ క్లబ్ లెవల్ క్రికెటర్లు 8మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అప్గాన్ క్రికెట్ బోర్డు వెల్లడించినట్లు ‘TOLO NEWS’ పేర్కొంది. మరో నలుగురికి గాయాలైనట్లు సమాచారం. మ్యాచులు పూర్తయ్యాక క్రికెటర్లు పక్టికాలోని షరానా నుంచి అర్గోన్‌కు వెళ్తుండగా బాంబు దాడులకు ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. ఈ దాడుల్లో పౌరులు, చిన్నారులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

News October 18, 2025

MHBD జిల్లాలో లిక్కర్ షాపులకు 937 దరఖాస్తులు

image

మహబూబాబాద్ జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల వివరాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 61 లిక్కర్ షాపులకు గాను 937 దరఖాస్తులు వచ్చాయని MHBD ఎక్సైజ్ సీఐ చిరంజీవి తెలిపారు.
MHBD 327, తొర్రూర్ 445, గూడూరు 165 కాగా.. మొత్తం 937 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈనెల 18తో గడువు ముగిస్తుందన్నారు.