News February 6, 2025

గజ్వేల్‌లో KCR రాజీనామా చేయాలా.. వద్దా..?: (VIRAL)

image

GHMC కార్పొరేటర్ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి‌ BRS తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. ‘అసెంబ్లీకి రాని, ప్రజల సమస్యలు పట్టించుకోని KCR గారు గజ్వేల్ MLAగా రాజీనామా చేయాలా..? వద్ద..?’ అని ప్రశ్నించారు. దీనిపై ఇరు పార్టీల సోషల్ యాక్టివిస్ట్‌‌లు స్పందించారు. నిజమే అని BJP శ్రేణులు.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఏంటని BRS నేతలు పోటీ పడటం గమనార్హం.

Similar News

News March 18, 2025

మెదక్: దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత: కలెక్టర్

image

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్యలతో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతులు అందజేశారు.

News March 17, 2025

మెదక్: లక్ష్యాలు పూర్తి చేయడంలో వేగం పెంచాలి: అదనపు కలెక్టర్

image

బ్యాంక్ గ్యారంటీలు, సీఎంఆర్ లక్ష్యాలు పూర్తి చేయడంలో రైస్ మిల్లర్స్, బ్యాంకర్స్ వేగం పెంచాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. సోమవారం ఖరీఫ్ 24 -25 సంబంధించి బ్యాంక్ గ్యారంటీలు అందజేయడం, సీఎంఆర్ లక్ష్యాలపై బ్యాంకర్లు, రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాల మేరకు లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.

News March 17, 2025

మెదక్: ప్రజావాణి వినతులు స్వీకరించిన జిల్లా ఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని తెలిపారు.

error: Content is protected !!