News March 25, 2025
గజ్వేల్ అంటే అభిమానం.. అభివృద్ధికి సహకరిస్తా: సీఎం

గజ్వేల్ నియోజకవర్గం పట్ల తనకు ప్రత్యేక అభిమానం ఉందని గజ్వేల్ అభివృద్ధికి సహకరిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పాదయాత్రగా వెళ్లి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ శాసనసభకు రాకపోవడంతో నియోజకవర్గ సమస్యలు సభలో ప్రస్తావనకు రావట్లేదని సీఎంను కలిసి ఫిర్యాదు చేశారు. ఈవిషయం తన దగ్గరికి వచ్చిన వీడియోను సీఎం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రజల సంక్షేమం ముఖ్యమన్నారు.
Similar News
News April 2, 2025
బాలానగర్: రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ బీహార్ వాసి మృతి చెందిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం.. బీహార్‌కి చెందిన బినోద్ ముర్ము(32) మండల కేంద్రం శివారులోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
News April 2, 2025
జనగామ: చికిత్స పొందుతూ మహిళ మృతి

పురుగు మందు తాగి చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన ఘటన జనగామ జిల్లా నర్మెట్ట మండలం వెల్దండ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కవిత(40) మంగళవారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 2, 2025
నిజామాబాద్ జిల్లా ఎండ తీవ్రత

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం ఎడపల్లిలో 39.6℃, మంచిప్ప, గోపన్నపల్లి, నిజామాబాద్, కోటగిరి 39.5, మదనపల్లి, చిన్న మావంది 39.4, మల్కాపూర్ 39.3, పెర్కిట్, మోస్రా 39.2, సాలూరా 39.1, రెంజల్, కల్దుర్కి 38.7, వేల్పూర్, వెంపల్లె 38.6, లక్మాపూర్, చింతలకొండూర్, ముప్కల్, యర్గట్ల 38.4, చందూర్, బాల్కొండ 38.3, పోతంగల్ 38, జక్రాన్‌పల్లి, రుద్రూర్, జకోరా 37.8℃ ఉష్ణోగ్రత నమోదైంది.