News February 18, 2025
గజ్వేల్: అటవీ భూముల నుంచి త్రిబుల్ ఆర్: కలెక్టర్

హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు జిల్లాలోని గజ్వేల్, మైలారం గ్రామంలో గల 28 హెక్టార్ల అటవీ భూమిలో నుంచి వెళ్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి తెలిపారు. జిల్లా స్థాయి స్వచ్చంధ సంస్థల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఫారెస్ట్ రైడ్ యాక్ట్‌లో ఎలాంటి కేసులు నమోదు కాలేదని తెలిపారు. అలాగే జిల్లాలో గల అటవీ భూమి ఉన్న ప్రాంతాన్ని మొత్తం సంరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
Similar News
News March 16, 2026
జగిత్యాల: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతి

జగిత్యాల జిల్లాలో మార్క్‌ఫ్‌డ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కోరారు. సోమవారం జగిత్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అంతకుముందు జీవన్ రెడ్డి రైతులతో కలిసి బైక్ ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లారు. అదనపు కలెక్టర్ రాజా గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు.
News March 16, 2026
కృష్ణా: ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. NTR జిల్లాలో 99.24 శాతం, కృష్ణా జిల్లాలో 98.76% మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యారు. ఎక్కడా మాస్ కాపీయింగ్, అవాంఛనీయ ఘటనలు జరగలేదని కృష్ణా DEO సుబ్బారావు తెలిపారు. ఓపెన్ టెన్త్ విభాగంలోనూ పరీక్షలు సజావుగా సాగాయని, కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు.
News March 16, 2026
జగిత్యాల: ప్రజావాణి ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రాజా గౌడ్ అధికారులను ఆదేశించారు. సోమవారం JGTL కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీవోలతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 57 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. సంబంధిత శాఖలు అర్జీలపై సమగ్ర విచారణ జరిపి పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలన్నారు.


