News March 23, 2025
గజ్వేల్: అహ్మదీపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (వీడియో)

గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామ శివారులోని పెద్దమ్మ తల్లి దేవాలయం సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తొగుట వైపు నుంచి గజ్వేల్ వైపు వస్తున్న లారీ బంజేరుపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలపై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో భార్య అక్కడిక్కడే మృతి చెందగా, భర్త తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు.
Similar News
News December 5, 2025
తిరుమల: సుబ్రహ్మణ్యం కస్టడీ పిటిషన్ 8న

తిరుమల కల్తీ నెయ్యి కేసులో అప్పటి TTD ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం కస్టడీ పిటిషన్ సిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గురువారం దీనిపై వాదనలు జరిగాయి. సిట్ 5 రోజుల కస్టడీ కోరగా నెల్లూరు ACB కోర్టు 8వ తేదీ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.
News December 5, 2025
VKB: ధాన్యం కొనుగోలు డబ్బులు వెంటనే చెల్లించాలి: అ.కలెక్టర్

రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఓపీఎంఎస్లో అప్లోడ్ చేసి, రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లతో పాటు రేషన్ సరుకులను కూడా సకాలంలో పంపిణీ చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
News December 5, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> పాలకుర్తి: బీఆర్ఎస్లో చేరిన మాజీ సర్పంచ్
> పీఎండీడీకేవైలో జనగామకు స్థానం
> లింగాల గణపురం: కాంగ్రెస్ నుంచి ఇద్దరు బహిష్కరణ
> దేవరుప్పుల: భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి
> ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి: కలెక్టర్
> దేవరుప్పుల: బీఆర్ఎస్లో చేరికలు
> స్టే. ఘ: ట్రాన్స్ఫార్మర్ను ఢీకొన్న వాహనం
> ఎన్నికల నిబంధనలు పాటించాలని కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశం


