News March 23, 2025

గజ్వేల్: అహ్మదీపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (వీడియో)

image

గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామ శివారులోని పెద్దమ్మ తల్లి దేవాలయం సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తొగుట వైపు నుంచి గజ్వేల్ వైపు వస్తున్న లారీ బంజేరుపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలపై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో భార్య అక్కడిక్కడే మృతి చెందగా, భర్త తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో  ఆస్పత్రికి తరలించారు.

Similar News

News April 18, 2025

తిరుమలలో ఒంగోలు వాసుల కారు దగ్ధం

image

తిరుమలలో ప్రమాదం తప్పింది. ఒంగోలుకు చెందిన భక్తులు కారులో తిరుమలకు వచ్చారు. కొండపై ఉన్న కౌస్తుభం పార్కింగ్ ప్రాంతంలో నిలిపారు. కారులో అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. వెంటనే భక్తులు దిగేశారు. తర్వాత కొద్దిసేపటికే కారులో మంటలు చెలరేగాయి. వాహనం మొత్తం కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

News April 18, 2025

నరసన్నపేట: ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పద మృతి

image

నరసన్నపేట వంశధార సబ్ డివిజన్‌లో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న కోర్రాయి వెంకటరమణ (57) అనుమానాస్పదంగా అనుమానాస్పదంగా మృతి చెందారు. నరసన్నపేట మారుతి నగర్ ఒకటో వీధిలో నివాసముంటున్నారు. ఆయన భార్య ఇటీవల మృతి చెందింది. మూడ్రోజులుగా అతడు బయటకు రాలేదని, శుక్రవారం సాయంత్రం దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉందని ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు.

News April 18, 2025

కేసీఆర్ సెంటిమెంట్.. ఉమ్మడి KNRలో BRS సభ

image

KCRకు సెంటిమెంట్ జిల్లా అయిన ఉమ్మడి KNR(ఎల్కతుర్తి)లో ఈనెల 27న BRS రజతోత్సవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. 20లక్షల మందితో 1500ఎకరాల్లో సభ ఏర్పాటు చేయనున్నారు. TRSని పెడుతున్నట్లు మొదటిసారిగా KNR గడ్డపైనే KCR ప్రకటించారు. రైతుబంధు, దళితబంధు పథకాలను కూడా ఈ జిల్లాలోనే ప్రారంభించారు. అధికారం కొల్పోయిన తర్వాత ఉమ్మడి KNR(ఎల్కతుర్తి)లో BRS మొదటిసారిగా భారీఎత్తున సభ పెడుతున్నందున ఆసక్తి నెలకొంది.

error: Content is protected !!