News February 16, 2025
గజ్వేల్: ఎదురెదురుగా రెండు కార్లు ఢీ.. ఒకరు మృతి

ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న ఘటన గజ్వేల్ మండలం బయ్యారం స్టేజ్ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అక్కడే ఉన్న వారు 108కి సమాచారం ఇవ్వగా గజ్వేల్ 108 సిబ్బంది EMT వర్షిత, లక్ష్మణ్, రాజు, పైలట్స్ నరేశ్, ప్రభాకర్ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 18, 2026
ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

*లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు
*అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు
*రాజ్యాంగాన్ని మార్చే కుట్రను తిప్పికొట్టాం: రాహుల్
*విపక్షాలపై అమిత్ షా, చంద్రబాబు, వైఎస్ జగన్ ఫైర్
*రేపు దేశవ్యాప్తంగా నిరసనలకు NDA పిలుపు
*హార్ముజ్ ఓపెన్ చేశాం: ఇరాన్
*అంబానీని దాటేసి.. ఆసియా కుబేరుడిగా అదానీ
News April 18, 2026
GT vs KKR.. ఎవరు గెలిచారంటే?

IPL-2026లో KKRకు మరో ఓటమి ఎదురైంది. కేకేఆర్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ గిల్ 86 పరుగులతో రాణించారు. అంతకుముందు గ్రీన్ 79 రన్స్ చేయడంతో కేకేఆర్ 180 పరుగులు చేయగలిగింది. ఇది GTకి మూడో విజయం కాగా, KKRకు 5వ ఓటమి.
News April 18, 2026
1 Min లేటైనా CETకు అనుమతి లేదు

AP: Eng, Agri తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET ఇతర పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని APSCHE స్పష్టం చేసింది. CETలపై ఇవాళ కన్వీనర్లతో సమీక్షించి షెడ్యూల్ జారీ చేసింది. EAPCET-Eng మే 12-15, 18, Agri& phm మే 19, 20 తేదీల్లో జరుగుతాయి. ECET APR 23, PGECET APR 28-30, ICET మే 2, లాసెట్ మే4, EDCET మే 8, PGCET మే 8-11తేదీల్లో జరుగుతాయి.PGCET 3, ఇతర సెట్లన్నీ 2 షిఫ్ట్‌లలో ఉంటాయి.


