News May 25, 2024
గజ్వేల్: కాలం చెల్లిన 610 కిలోల విత్తనాలు స్వాధీనం

గజ్వేల్ పట్టణంలోని సీడ్స్ & ఫర్టిలైజర్ షాపుల్లో గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి, ఇన్స్పెక్టర్ సైదా తనిఖీలు నిర్వహించారు. 610 కిలోల కాలం చెల్లిన విత్తనాలు, మెంతులు గంగవాయిలు కూర, బీర్నిస్, వరి ధాన్యం, కొన్ని రకాల పురుగుల మందులు ఫర్టిలైజర్స్ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. సీపీ ఆదేశాల మేరకు గజ్వేల్ పట్టణంలో ఉన్న సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.
Similar News
News November 25, 2025
MDK: కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ హెచ్చరిక

నర్సాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మంగళవారం నర్సాపూర్ మార్కెట్లోని ఫ్యాక్స్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే, ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతను కూడా కలెక్టర్ పరిశీలించారు.

పాపన్నపేట: ఇంట్లో నుంచి వెళ్లి యువకుడి సూసైడ్

పాపన్నపేట మండలం కొత్తపల్లిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. కొత్తపల్లి గ్రామానికి చెందిన గడ్డమీది ఉమేష్ ముదిరాజ్(23) కుటుంబ సమస్యలతో గొడవ పడి రాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు. సోదరికి ఫోన్ చేసి చనిపోతున్నట్లు చెప్పడంతో అతని కోసం గాలించినా ఆచూకీ లభించదు. ఉదయం స్కూల్ వెనకాల చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.