News March 7, 2025
గజ్వేల్: గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో 2025 విద్యా సంవత్సరానికి గాను అతిథి అధ్యాపకులుగా బోధన చేసేందుకు ఆసక్తి కలవారు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డా. నిఖత్ అంజుమ్ ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాలలో ఎకనామిక్స్ సబ్జెక్టులో ఒక పోస్టు ఖాళీగా ఉందన్నారు. దరఖాస్తు చేసుకునే వారు పీజీలో 55% మార్కులు, ఎస్సీ, ఎస్టీలైతే 50% మార్కులు ఉండాలన్నారు. ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News December 4, 2025
ప్రాతఃకాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి భద్రకాళి దేవస్థానంలో గురువారం మార్గశిర మాసం పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు చేసి హారతినిచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్ధ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
News December 4, 2025
పెద్దపల్లి: ట్రాక్టర్ను ఢీకొని వ్యక్తి మృతి

PDPL(D) ధర్మారం మండలం నాయికంపల్లి తండాకు చెందిన నవనందుల రాజేశ్(36) గోదావరి స్నానం చేసి బైక్పై ఇంటికి వస్తుండగా పత్తిపాక డాంబర్ ప్లాంట్ వద్ద నిలిపి ఉన్న ట్రాక్టర్ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనతో పాటు ఉన్న అరవెండి కిష్టయ్య(45), మంగారపు సాయికుమార్(30)కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108లో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. CI ప్రవీణ్ కుమార్, SI ప్రవీణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
News December 4, 2025
VJA: భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు నజరానా

భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రోత్సాహకంగా భారీ నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో జట్టుకు రూ.10 లక్షల చెక్కును కెప్టెన్ దీపికకు అందజేశారు. ఫైనల్లో కీలక పాత్ర పోషించిన పొంగి కరుణా కుమారికి రూ. 5 లక్షలు, జట్టు కోచ్ అజేయ్ కుమార్ రెడ్డికి రూ.1 లక్షను ఏసీఏ ప్రదానం చేసింది.


