News May 5, 2024
గజ్వేల్: పడిపోయిన చెట్టు.. రూ.10వేల జరిమానా

గజ్వేల్ పట్టణంలో బైక్ మెకానిక్ షాపు ముందున్న చెట్టు వద్ద మంట పెట్టడంతో చెట్టు మొదలు కాలి పడిపోయింది. దీంతో సదరు వ్యక్తికి మున్సిపల్ సిబ్బంది రూ.10000 జరిమానా విధించారు. చెట్టు పోయిన చోటనే వేరే మొక్కను పెట్టించారు. ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లును కొట్టివేస్తే వారిపై చర్యలు తీసుకోబడునని కమిషనర్ గోల్కొండ నర్సయ్య హెచ్చరించారు.
Similar News
News October 22, 2025
మెదక్: సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి: కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఈ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రజలు ఈ సర్వేలో పాల్గొని సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25న ముగుస్తుందన్నారు.
News October 22, 2025
మెదక్: రాయితీపై విత్తనాలు పంపిణీ: కలెక్టర్

రేగోడ్ రైతు వేదికలో మంగళవారం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో రాయితీ పై ప్రొద్దు తిరుగుడు, శనగ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ మాట్లాడుతూ.. యాసంగి 2025-26 సీజన్కు గజ్వాడ గ్రామంలో 50 ఎకరాల్లో బ్లాక్ లెవెల్ డెమో చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ADA టెక్నికల్ జి.విన్సెంట్ వినయ్, ADA ఇన్ఛార్జ్ రాంప్రసాద్, MAO మొహమ్మద్ జావీద్, MRO దత్తు రెడ్డి పాల్గొన్నారు.
News October 21, 2025
MDK: మంజీరా నదిలో ఒకరి మృతి.. మరొకరి గల్లంతు

మెదక్ మండలం పేరూరు శివారులో మంజీరా వాగులో పడి బాలుడు మృతి చెందగా, రక్షించేందుకు దిగిన మరో వ్యక్తి గల్లంతయ్యాడు. గ్రామస్థుల వివరాలు.. పేరూరు గ్రామానికి చెందిన చింతకింది అంజమ్మ నిన్న మృతి చెందింది. ఈరోజు సాయంత్రం అంత్యక్రియల అనంతరం మంజీరాలో స్నానం చేసేందుకు దిగగా కృష్ణ (16) కాలుజారి పడిపోయాడు. కృష్ణ రక్షించేందుకు బీరయ్య వాగులో దిగి గల్లంతయ్యాడు. కృష్ణ మృతదేహం లభ్యం కాగా, బీరయ్య కోసం గాలిస్తున్నారు.