News March 24, 2025

గజ్వేల్: పాదయాత్రగా వెళ్లి.. సీఎంకి ఫిర్యాదు.!

image

గజ్వేల్‌ కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అసెంబ్లీకి హాజరుకాని మాజీ సీఎం కేసీఆర్ శాసనసభా సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ వినతిపత్రం ఇచ్చారు. సీఎం నివాసానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సీఎంకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేత నర్సారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో సిద్దిపేట నుంచి పాదయాత్రకు కాంగ్రెస్ శ్రేణులు HYD చేరుకున్నారు.

Similar News

News October 15, 2025

అనంతపురంలో ఏరోస్పేస్&ఆటోమోటివ్: లోకేశ్

image

AP: అనంతపురంలో రేమండ్ కంపెనీ రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఏరోస్పేస్, ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్ల సబ్సిడీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

News October 15, 2025

నిషేధిత జాబితా నుంచి తొలగించాలని వినతి

image

చౌటుప్పల్: రాచకొండ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 106ను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రాచకొండ రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావును కోరారు. ఈ మేరకు బుధవారం వారు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. 2018లో పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసినా, తమ భూములు అమ్ముకోకుండా గత ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

News October 15, 2025

కలెక్టరేట్ నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తి చేయాలి: కలెక్టర్

image

ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణ పనులు డిసెంబరు నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి ఆయన కలెక్టరేట్‌ను పరిశీలించారు. ప్రజల పరిపాలనకు ఉపయోగపడే గదులన్నీ కింద ఫ్లోర్‌లో ఉండేలా, ఒక్కో శాఖకు కేటాయించే స్క్వేర్ ఫీట్‌ను నిర్ణయించి, గదులను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.