News April 12, 2024
గజ్వేల్: మరోసారి తెరపైకి RRR అలైన్మెంట్ మార్పు అంశం

రీజనల్ రింగ్ రోడ్డు(RRR) ఉత్తర భాగం భూసేకరణకు అధికారులు సిద్ధమవుతున్న వేళ కీలక పరిణామం జరిగింది. మర్కూక్ మండల రైతులు మంత్రి వెంకట్ రెడ్డిని కలవడంతో మరోసారి అలైన్మెంట్ మార్పు అంశం తెరపైకి వచ్చింది. HYD రింగ్ రోడ్డుకు 30KMలోపు RRR ఖరారు చేయడంతో నష్టం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మరోసారి మార్పులు జరిగే అవకాశం ఉంది. దీనికి ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా గజ్వేల్‌లో 980 ఎకరాలు సేకరిస్తున్నారు.
Similar News
News December 4, 2025
మెదక్: 3వ విడత మొదటి రోజు 139 నామినేషన్లు

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో 139 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-14, కౌడిపల్లి-34, కుల్చారం-8, మాసాయిపేట-15, నర్సాపూర్-16, శివంపేట-30, వెల్దుర్తి-22 చొప్పున నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు 344 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈరోజు దత్త జయంతి పౌర్ణమి ఉండడంతో ఎక్కువ నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది.

మెదక్: 2వ విడత బరిలో 670 మంది అభ్యర్థులు

మెదక్ జిల్లాలో రెండవ విడతలో జరగనున్న 8 మండలాల్లోని 149 గ్రామపంచాయతీ ఎన్నికల్లో మొత్తం 670 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. చేగుంట (134), చిన్న శంకరంపేట్ (113), రామాయంపేట (87) మండలాల్లో అత్యధిక అభ్యర్థులున్నారు. శనివారం నాటి ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత రానుంది.