News June 2, 2024
గజ్వేల్: యువకుడి అనుమానాస్పద మృతి.. ఛేదించిన పోలీసులు

గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గురువారం రాత్రి అనుమానాస్పదంగా <<13346047>>యువకుడు మృతి<<>> చెందిన కేసును పోలీసులు ఛేదించారు. అహ్మదీపూర్ గ్రామానికి చెందిన జమాల్పూర్ సోనీబాయి(34)తో నరేశ్ చారి అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో సోని కూతురిపై నరేశ్ కన్నేశాడని గమనించి, పలుమార్లు మందలించింది. అయినా వినకపోవడంతో కొడుకు జమాల్పూర్ కిషోర్‌తో కలిసి హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు గజ్వేల్ ACP పురుషోత్తంరెడ్డి తెలిపారు.
Similar News
News February 27, 2026
ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం: కలెక్టర్ ప్రతిమా సింగ్

రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని, పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.
News February 27, 2026
మెదక్ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్

మెదక్ నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమా సింగ్‌ను టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించి, మొక్కను అందజేశారు. గతంలో తాను అదనపు కలెక్టర్‌గా పనిచేసినప్పుడు ఉద్యోగులు అందించిన సహకారాన్ని కలెక్టర్ గుర్తుచేసుకున్నారు. అదే స్ఫూర్తితో జిల్లా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఆమె సూచించారు.
News February 27, 2026
మెదక్: కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ

మెదక్ జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమా సింగ్‌ను ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలను వివరించారు.


