News June 4, 2024
గజ్వేల్ సెగ్మెంట్లో బీజేపీ ఆధిక్యం

గజ్వేల్ అసెంబ్లీ సిగ్మెంట్లో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. మొదటి రౌండ్లో బీజేపీకి 3728 ఓట్లు రాగా, కాంగ్రెస్కు 2749 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కు 2543 ఓట్లు పోలైనట్లు అధికారులు ప్రకటించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి పై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 979 ఓట్ల ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ మూడవ స్థానానికి పడిపోయింది.
Similar News
News October 21, 2025
మెదక్: 8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు

పాపన్నపేట మండలం పొడ్చన్ పల్లి గ్రామానికి చెందిన అరక అజయ్ కుమార్ 8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.
అరక జ్యోతి, సంజీవరావు కుమారుడు అజయ్ కుమార్ 2018లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, పంచాయతి కార్యదర్శిగా విధుల్లో చేరాడు. తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే లోకో పైలట్, ఆర్ఎస్ఐ, కానిస్టేబుల్, 2023లో ఎస్ఐ, గ్రూప్-2లో ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగం సాధించాడు.
News October 20, 2025
మెదక్: అగ్నిమాపక కేంద్రంలో కలెక్టర్ తనిఖీ

మెదక్ జిల్లా రామాయంపేటలోని అగ్నిమాపక కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. అగ్నిమాపక సేవలపై హర్షం వ్యక్తం చేసిన కలెక్టర్, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. కేంద్రంలోని పరికరాల పనితీరు, వాహనాల వినియోగం, హాజరు పట్టికను ఆయన పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు సిబ్బంది వెంటనే స్పందించాలని కలెక్టర్ ఆదేశించారు.
News October 19, 2025
మెదక్: పాతూరు సబ్స్టేషన్ను సందర్శించిన కలెక్టర్

మెదక్ మండలం పాతూరు సబ్స్టేషన్ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. విద్యుత్ సరఫరా తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగేలా, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రైతులకు ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.