News March 12, 2025
గజ్వేల్: KCRని కలిసిన దాసోజు శ్రవణ్

ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇచ్చిన సందర్భంగా నామినేషన్ అనంతరం స్క్రూటినీ పూర్తిచేసుకున్న డాక్టర్ దాసోజు శ్రవణ్ మంగళవారం బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. కుటుంబ సమేతంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసి, ఆశీర్వాదం తీసుకున్నారు.
Similar News
News February 28, 2026
ఈనాటి ముఖ్యాంశాలు

➤ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్, కవితకు క్లీన్‌చిట్
➤ కాంగ్రెస్ నిరసనలకే పరిమితమైంది: PM మోదీ
➤ తమిళ హీరో విజయ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన భార్య సంగీత
➤ కూటమి పాలనలో నీరు, పాలూ ప్రాణాంతకమే: జగన్
➤ ఇళ్లు రాని వాళ్లంతా అప్లై చేసుకోవాలి: CBN
➤ కవితకు న్యాయం జరిగింది: కేటీఆర్
➤ ₹47,776 CRతో AP అక్రమ ప్రాజెక్టులు: TG
➤ భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు.. ₹5లక్షల కోట్లు ఆవిరి!
News February 28, 2026
రెడ్‌బుక్‌లో జగన్ పేరు ఉందా? లోకేశ్ ఏమన్నారంటే..

AP: YCP హయాంలో తమ కార్యకర్తలు, ప్రజలపై తప్పుడు కేసులు పెట్టిన వారి పేర్లు రెడ్‌బుక్‌లో ఉన్నాయని లోకేశ్ తెలిపారు. ‘లా బ్రేక్ చేసిన, అందుకు ప్రేరేపించిన నేతలు, టార్చర్ చేసినవాళ్ల పేర్లు ఉంటాయి. జగన్ పేరు ఉందో లేదో త్వరలో తెలుస్తుంది. అటు SMలో 16ఏళ్ల లోపువారికి ఏజ్ అప్రాప్రియేట్ కంటెంటే కనిపించాలి. దీనిపై ఫ్రేమ్‌వర్క్‌కు కసరత్తు చేస్తున్నాం’ అని ముంబైలో జరిగిన ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సులో అన్నారు.
News February 28, 2026
WI చేతిలో 3 సార్లు హార్ట్ బ్రేక్.. ఈసారి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే!

T20WC-2026లో భారత్ సెమీస్ చేరాలంటే మార్చి 1న కచ్చితంగా వెస్టిండీస్‌ను ఓడించి తీరాల్సిందే. అయితే పొట్టి ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు 4 సార్లు తలపడ్డాయి. మూడింట్లో విండీస్ గెలవగా, టీమ్ ఇండియా ఒకసారి మాత్రమే విజయం సాధించింది. 2009, 10లో సూపర్-8 దశలో, 2016లో సెమీఫైనల్లో ఓడించి భారత అభిమానుల హార్ట్ బ్రేక్ చేసింది. ఈసారి కూడా ఆ జట్టు బలంగా ఉంది. మరి WIను ఓడించాలంటే సూర్య సేన విజృంభించాల్సిందే.


