News December 2, 2024
గజ్వేల్: KCR ఇలాకాలో రేవంత్ రెడ్డి మాట ఇదే!

సిద్దిపేట జిల్లాలో నేడు <<14764463>>CM రేవంత్ రెడ్డి పర్యటన<<>> విషయం తెలిసిందే. గజ్వేల్ పరిధి బండ తిమ్మాపూర్‌లో హిందుస్థాన్ కోకాకోలా కంపెనీని సీఎం ప్రారంభించనున్నారు. కాగా ఏడాది క్రితం కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన గజ్వేల్ ప్రజలకు పరిశ్రమలు తెస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు CM హోదాలో పరిశ్రమలు ప్రారంభించనున్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
Similar News
News January 21, 2026
MDK: హత్యాయత్నం కేసులో నేరస్తుడికి ఐదేళ్ల జైలు శిక్ష

నర్సాపూర్ PS పరిధిలో ఇవ్వాల్సిన డబ్బులను అడిగిన వ్యక్తిపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సుభావళి తీర్పునిచ్చినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆటో డ్రైవర్ వడ్ల నిరంజన్ కల్లు తాగేందుకు కల్లు దుకాణం వద్దకు వెళ్లగా, అక్కడ కనిపించిన శివప్రసాద్‌ను ఇవ్వాల్సిన డబ్బులు అడగగా గొడవ జరిగింది. దీంతో కల్లు సీసా పగలగొట్టి పొడిచాడు.
News January 21, 2026
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం: మంత్రి వివేక్

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల 157 సంఘాలకు రూ.66,93,541 వడ్డీలేని రుణాల చెక్కును అందజేశారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా రూ.3,09,46,721 వడ్డీని అందించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మహిళా పెట్రోల్ బంక్ కోసం స్థల సేకరణ జరుగుతుందన్నారు.