News January 6, 2025
గడివేముల: రూ. లక్షలు డిపాజిట్ అయ్యాయ్.. వేరే వారికి పంపే వీలు లేదు
రూ. 3.24 లక్షలు ఖాతాలోకి జమచేసి బ్యాంకు అకౌంట్ హ్యాక్ చేసే యత్నం గడివేములలో ఆదివారం జరిగింది. పరమేశ్ బ్యాంకు ఖాతాలోకి రూ. 3.24 లక్షలు వచ్చినట్లు మెసేజ్ వచ్చింది, ఖాతాలోనూ చూపించింది. కానీ వేరే వారి ఖాతాకు పంపేందుకు చూస్తే కుదురలేదు. మరొకసారి బ్యాంకు ఖాతా చెక్ చేయగా.. డిపాజిట్ అయిన నగదుతో పాటు తన డబ్బులు రూ. 1.600 కూడా కట్ అయ్యాయి. బాధితుడు మోసాన్ని గుర్తించి అప్రమత్తమయ్యాడు.
Similar News
News January 9, 2025
పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన రద్దు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేటి కర్నూలు జిల్లా పర్యటన రద్దయింది. తిరుపతి బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఆయన జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. త్వరలోనే మళ్లీ జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది.
News January 9, 2025
పోర్న్ సైట్ల పేరుతో జరిగే మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
పోర్న్ సైట్ల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పోర్న్ సైట్లు చూస్తున్న వారిని కొంతమంది బెదిరించి, డబ్బు దోచుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదే క్రమంలో సోషల్ మీడియాలో వచ్చే అనవసర లింక్స్ ఓపెన్ చేయవద్దని పేర్కొన్నారు.
News January 9, 2025
నేడు కర్నూలు జిల్లాకు పవన్ కళ్యాణ్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఉ.11:45 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి 11:50 గంటలకు హెలికాఫ్టర్లో బయలుదేరి గడివేముల మండలం గని వద్ద ఏర్పాటు చేసిన సోలార్ పార్క్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సైట్ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు అప్పర్ రిజర్వాయర్ను పరిశీలించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు.