News October 27, 2024
గడువులోగా పూర్తి కావాలి: SKLM కలెక్టర్
జిల్లా వెంబడి ప్రవహిస్తున్న ప్రధాన నదులైన నాగావళి, వంశధార నదుల అనుసంధానం జూన్ 2025 నాటికి పూర్తిచేసేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. పలు ప్రాజెక్టుల ముఖ్య అధికారులతో కలెక్టరేట్లో శనివారం జేసీ అహ్మద్‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. నదుల అనుసంధానానికి సంబంధించి ఇప్పటికే రూ.106 కోట్ల ఖర్చు చేసి 75 శాతం పనులు పూర్తి చేసినట్లు వివరించారు.
Similar News
News November 7, 2024
శ్రీకాకుళం: B.Ed సెమిస్టర్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల
శ్రీకాకుళం జిల్లా పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ స్పెషల్ B.Ed M.R 2వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ గురువారం వివరాలు వెల్లడించారు. అభ్యర్థులు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 11వ తేదీ వరకు, రూ.100 అపరాధ రుసుముతో 12 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. నవంబర్ 18వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
News November 7, 2024
శ్రీకాకుళం: LAW ప్రవేశాలకు నేడే చివరి రోజు
న్యాయవిద్యలో లా సెట్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులు గురువారం సాయంత్రం ఐదు గంటలలోపు ప్రవేశం పొందవలసి ఉంటుందని కోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ వై రాజేంద్రప్రసాద్ తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం న్యాయ న్యాయ కళాశాల ప్రవేశాలకు 66 సీట్లకు 65 మంది ఆప్షన్ ఇచ్చుకున్నారు. సీట్లు లభించిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. లేదంటే సీటు రద్దు అవుతుంది.
News November 7, 2024
శ్రీకాకుళం: పరీక్ష ఫీజు చెల్లించేందుకు మరో నాలుగు రోజులే
శ్రీకాకుళం జిల్లాలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష ఫీజును మరో నాలుగు రోజుల్లో చెల్లించాలి. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 35 వేల మందికి పైగా చదువుతున్నారు. అక్టోబర్ 21 నుంచి చెల్లింపు మొదలవ్వగా వీరంతా ఈ నెల 11వ తేదీలోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఇంటర్ పరీక్ష ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.