News July 5, 2024
గడ్కరీతో బండి సంజయ్ కుమార్ భేటీ

కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భేటీ అయ్యారు. తెలంగాణలోని జాతీయ రహదారుల విస్తరణతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పురోగతిలో ఉన్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు, కొత్త రహదారుల నిర్మాణ ప్రతిపాదనల అమలు అవకాశాలపై చర్చించారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మండలాల్లో రోడ్ల విస్తరణకు సంబంధించి సీఆర్ఐఎఫ్ నిధులు విడుదల చేయాలని కోరారు.
Similar News
News December 1, 2025
KNR: ‘హెచ్ఐవీ తగ్గుముఖం.. ‘జీరో’ లక్ష్యంగా కృషి’

దేశంలో ఎయిడ్స్ తగ్గుముఖం పడుతుందని ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా కరీంనగర్ ఫిలిం భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డాక్టర్ వెంకటరమణ అన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కేసుల సంఖ్యను ‘జీరో’కు తీసుకురావడమే ధ్యేయమన్నారు. వ్యాధిగ్రస్తులు ధైర్యంగా మందులు వాడాలని సూచించారు. అనంతరం ఐసీటీసీ కౌన్సిలర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
News December 1, 2025
‘TCC పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవాలి’

TG ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించే డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ TCC(టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా DEC 5లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఆర్ట్ వర్క్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ జిల్లాఅధ్యక్షులు తాడూరి లక్ష్మీనారాయణ సూచించారు. పూర్తి వివరాలకు www.bsetelangana.gov.in వెబ్సైట్ను సందర్శించాలని ఆయన కోరారు.
News November 30, 2025
కరీంనగర్: 113 గ్రామాలకు 121 నామినేషన్లు

కరీంనగర్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల మొదటి రోజు 113 గ్రామాలకు121 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. చిగురు మామిడి మండలంలో 16, గన్నేరువరం మండలంలో 10, మానకొండూర్ మండలంలో 30, శంకరపట్నం మండలంలో 35, తిమ్మాపూర్ మండలంలో 30 గ్రామ సర్పంచికి నామినేషన్లు దాఖలు అయ్యాయి.113 గ్రామాలలో 1046 వార్డు లు ఉండగా, మొదటి రోజు 209 నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు.


