News November 18, 2024
గడ్డి మందు తాగి యువకుడి ఆత్మహత్య

గడ్డి మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. M.Vపాలెంకు చెందిన వంశీ HYDలో ఉంటూ కాంపిటేటివ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తున్న కూడా జాబ్ రాలేదు. దీంతో మనస్తాపానికి గురై వంశీ గడ్డి మందు తాగాడు. ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించాడు. వంశీ మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News November 24, 2025
దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ అనుదీప్

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. పలు మండలాల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అర్హులకు న్యాయం చేయాలన్నారు. ఎక్కువగా భూ సమస్యలు, పారిశుద్ధ్య, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో ఫిర్యాదు చేయడానికి ప్రజావాణికి బాధితులు వచ్చారు.
News November 24, 2025
ఖమ్మం కలెక్టర్ అనుదీప్ వినూత్న కార్యక్రమం

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చేపట్టిన ‘చదవండి.. అర్థం చేసుకొండి.. ఎదగండి’ కార్యక్రమం జిల్లాలో ఉద్యమంలా సాగుతోంది. 958 పాఠశాలల్లోని 28,982 మంది విద్యార్థులకు దీనిని అమలు చేస్తున్నారు. కలెక్టర్ చొరవతో 1 నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక విద్యార్థుల అభ్యసన స్థాయి మెరుగైందని విద్యా యంత్రాంగం గుర్తించింది.
News November 24, 2025
ఐటీ హబ్ ఫేజ్ 2 విస్తరణ శరవేగం.. నెరవేరనున్న యువత కలలు

ఖమ్మం జిల్లాలో ఐటీ హబ్ ఫేజ్ 2 విస్తరణకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రణాళికలు సిద్ధం చేశారు. కొత్త ఐటీ కంపెనీలకు సౌకర్యాలు, రాయితీలను ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం 2 వేల మంది ఉద్యోగులు ఉండగా, రాబోయే ఐదేళ్లలో 10 వేలకు పైగా ఐటీ ఉద్యోగాలు స్థానిక యువతకు దక్కనున్నాయని అధికారులు తెలిపారు.


