News January 25, 2025
గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ టీఎస్ చేతన్ పరిశీలించారు. శనివారం సాయంత్రం ఎస్పీ రత్నతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలీస్ పెరేడ్ మైదానంలో రిహార్సల్స్ నిర్వహించారు. వందన సమర్పణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
Similar News
News November 27, 2025
అమరావతి: ‘రెండో విడత ల్యాండ్ పూలింగ్కు సహకరిస్తాం’

CM చంద్రబాబుతో సమావేశం సందర్భంగా అమరావతి రైతులు మాట్లాడారు. రాజధాని కోసం JACలు ఏర్పాటు చేసుకొని ఉద్యమించామని, ఇక అమరావతి డెవలప్మెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటామన్నారు. 2వ విడత భూసమీకరణకు పూర్తిగా సహకరిస్తామని, CM రూపొందించిన ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే తమకు మేలు జరుగుతుందని, ల్యాండ్ పోలింగ్కు ఇవ్వని వారిని పిలిపించి మాట్లాడితే సమస్య త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడ్డారు.
News November 27, 2025
సూర్యాపేట జిల్లాలో మొదటి రోజు 245 నామినేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 159 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా సర్పంచి స్థానాలకు 207 మంది నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. 1,442 వార్డులకు 38 మంది నామినేషన్ దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ తెలిపారు.
News November 27, 2025
కామారెడ్డి జిల్లాలో తొలిరోజు 210 నామినేషన్లు

కామారెడ్డి జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. జిల్లాలోని 167 గ్రామ పంచాయతీల్లో (1,520 వార్డులకు) ఎన్నికలు జరగనున్నాయి. తొలి రోజు సర్పంచి స్థానాలకు 115 నామినేషన్లు రాగా, వార్డు సభ్యుల స్థానాలకు 95 నామినేషన్లు వచ్చాయి. తొలిరోజు నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు పెద్దగా ముందుకు రాలేదు.


