News January 25, 2025

గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ టీఎస్ చేతన్ పరిశీలించారు. శనివారం సాయంత్రం ఎస్పీ రత్నతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలీస్ పెరేడ్ మైదానంలో రిహార్సల్స్ నిర్వహించారు. వందన సమర్పణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

Similar News

News February 16, 2025

శ్రీశైలం విశిష్టత మీకు తెలుసా…!

image

ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలక్షేత్రం <<15471616>>రెండోది<<>>. ఈ మందిరంలో పరమేశ్వరుడు మల్లికార్జున స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. పూర్వం కుమారస్వామిని వెతకడానికి క్రౌంచ పర్వతం (శ్రీశైలం) వెళ్లిన శివుడు ఆయన ఉన్నచోటనే లింగరూపంలో వెలిశారు. అక్కడ మద్ది చెట్టుకు మల్లెతీగ అద్దుకొని ఉందట. అప్పటినుంచి స్వామి వారికి ‘మల్లికార్జునుడు’ అని పేరొచ్చిందని స్థలపురాణం పేర్కొంటుంది.

News February 16, 2025

లక్షెట్టిపేటలో భార్యను హత్య చేసిన భర్త

image

భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన లక్షెట్టిపేటలో జరిగింది. SI సతీశ్ వివరాల ప్రకారం.. గోదావరి రోడ్డుకు చెందిన గణేశ్ తన భార్య రాజ కుమారిని సిమెంటు ఇటుక, బండరాయితో కొట్టి చంపాడు. కాగా కొద్ది రోజులుగా గణేశ్ మద్యం తాగి వచ్చి భార్యకు ఇతరులతో వివాహేతర సంబంధం ఉందని గొడవ పడేవాడన్నారు. ఆమె ఆదివారం తెల్లవారుజామున బాత్రూమ్‌కు వెళ్ళగా గణేశ్ వెనకాలే వెళ్లి తలపై కొట్టి చంపాడని ఎస్ఐ వెల్లడించారు.

error: Content is protected !!