News January 23, 2025
గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ధర్మకంచలో గల మినీ స్టేడియాన్ని డీసీపీ రాజ మహేంద్ర నాయక్తో జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల గురించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సరైన జాగ్రత్తలను పాటించాలని, అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా సమన్వయంతో పనిచేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు.
Similar News
News December 23, 2025
రైతన్నకు మంచిరోజులు వచ్చేది ఎప్పుడో!

ధనిక, పేద తేడా లేకుండా అందరి ఆకలి తీర్చేది రైతు పండించే మెతుకులే. దాని కోసం రైతు పడే కష్టం, మట్టితో చేసే యుద్ధం వెలకట్టలేనిది. తెల్లవారుజామునే నాగలి పట్టి పొలానికి వెళ్లే అన్నదాతే అసలైన హీరో. తన రక్తాన్ని చెమటగా మార్చి పంటకు ప్రాణం పోసే రైతు అప్పుల్లో ఉంటే అది దేశానికే తీరని లోటు. రైతు ఆనందంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. మరి రైతు రాజయ్యేదెప్పుడో! *ఇవాళ జాతీయ <<18647657>>రైతు<<>> దినోత్సవం
News December 23, 2025
రైతుల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత: మంత్రి గొట్టిపాటి

దేశానికి అన్నం పెట్టే రైతులకు కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మంగళవారం జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులకు అన్నదాత సుఖీభవ, ఉచిత విద్యుత్, సబ్సిడీపై విత్తనాలు, యంత్రాలు మరియు రుణాలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. మొంథా తుఫాన్ సమయంలో బాపట్ల జిల్లాలోని రైతులకు అండగా ఉన్నామని మంత్రి పేర్కొన్నారు.
News December 23, 2025
అమరావతి బ్రాండ్కు ఊపిరి.. ‘ఆవకాయ’ సాంస్కృతిక ఉత్సవం

అమరావతి బ్రాండ్కు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో AP ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ దిశగా పర్యాటక శాఖ సరికొత్త సాంస్కృతిక ఉత్సవానికి శ్రీకారం చుట్టింది. ‘ఆవకాయ’ అనే వినూత్న పేరుతో నిర్వహించనున్న ఈ ఫెస్టివల్ ద్వారా తెలుగు సినిమా, సంస్కృతి, సాహిత్యాన్ని ఒకే వేదికపైకి తీసుకురావాలని జనవరి 8 నుంచి 10 వరకు విజయవాడ కేంద్రంగా వేడుకలు నిర్వహించనుంది.


