News January 23, 2025
గణతంత్ర వేడుకలకు గంగదేవిపల్లి మాజీ సర్పంచ్కు ఆహ్వానం

ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు గీసుగొండ మండలం జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లి తాజా మాజీ సర్పంచ్ గోనె మల్లారెడ్డికి ఆహ్వానం అందినట్లు ఆయన చెప్పారు. గంగదేవిపల్లి అభివృద్ధి చెందిన విధానంపై పలుమార్లు ప్రసార భారతి ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు. గ్రామ ప్రజలు ఐక్యతతో సాధించిన అభివృద్ధికి తనకు ఆహ్వానం అందిందని మల్లారెడ్డి తెలిపారు.
Similar News
News December 4, 2025
HYD: గూగుల్మ్యాప్స్ ఫాలో అవుతున్నారా? జాగ్రత్త!

గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని వెళ్తున్నారా? మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాత్రుళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. బోడుప్పల్లో ఓ వ్యక్తి తన వాహనంలో గుడ్డిగా దీన్ని నమ్మి బోడుప్పల్- పోచారం రూట్లో వెళ్లాడు. కుడివైపు మొత్తం మట్టి రోడ్డు ఉన్నప్పటికీ నావిగేషన్ అటువైపే చూపించింది. కొద్ది దూరం వెళ్లాక రోడ్డు లేకపోగా, భారీ గుంతలో పడ్డట్టు తెలిపారు. మీకూ ఇలా రాంగ్ డైరెక్షన్ చూపించిందా?
News December 4, 2025
గజ్వేల్: హోరెత్తనున్న ఎన్నికల ప్రచారం

గజ్వేల్ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల ప్రచారం నేటి నుంచి హోరెత్తనుంది. గజ్వేల్, దౌల్తాబాద్, రాయపోల్, ములుగు, వర్గల్, మర్కూక్, జగదేవపూర్ మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు పూర్తి కావడంతో డమ్మి సింబల్స్తో ప్రచారాన్ని నిర్వహించేందుకు వార్డు, సర్పంచ్ అభ్యర్థులు సిద్ధమయ్యారు. సమయం తక్కువగా ఉండడంతో SM ద్వారా ప్రచారం చేయనున్నారు.
News December 4, 2025
భద్రాద్రి: 3వ విడత తొలిరోజు అందిన నామినేషన్లు

3వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం 7 మండలాల నుంచి నామినేషన్లు స్వీకరించారు. మండలాల వారీగా బుధవారం అందిన సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్లు ఇలా. ఆళ్లపల్లి – 1, 2, గుండాల – 3, 3, జూలూరుపాడు – 5, 4, లక్ష్మీదేవిపల్లి – 4, 7, సుజాతనగర్ – 3, 1, టేకులపల్లి – 19, 7, ఇల్లందు – 6, 6.. 155 గ్రామపంచాయతీలకు గాను 41 సర్పంచ్, 30 వార్డు సభ్యులు నామినేషన్ దాఖలు చేశారని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు


