News January 23, 2025

గణతంత్ర వేడుకలకు గంగదేవిపల్లి మాజీ సర్పంచ్‌కు ఆహ్వానం

image

ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు గీసుగొండ మండలం జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లి తాజా మాజీ సర్పంచ్ గోనె మల్లారెడ్డికి ఆహ్వానం అందినట్లు ఆయన చెప్పారు. గంగదేవిపల్లి అభివృద్ధి చెందిన విధానంపై పలుమార్లు ప్రసార భారతి ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు. గ్రామ ప్రజలు ఐక్యతతో సాధించిన అభివృద్ధికి తనకు ఆహ్వానం అందిందని మల్లారెడ్డి తెలిపారు.

Similar News

News February 9, 2025

కిరణ్ రాయల్ వివాదానికి ఆ ఫొటోనే కారణమా?

image

తిరుపతి జనసేన ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్ వివాదానికి రెండు రోజుల క్రితం ఆయన ప్రెస్ మీట్‌లో జగన్ 2.0 పోస్టర్‌ను రిలీజ్ చేయడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ఫొటోతో మాజీ ముఖ్యమంత్రి హేళన చేయడం సహించలేని వైసీపీ నాయకులు కిరణ్ రాయల్ ఫోన్ గతంలో గుర్తు తెలియని వ్యక్తులు తస్కరించారు. ఈ క్రమంలోనే ఆయన డేటాను అటు మీడియాకు ఇచ్చి సోషల్ మీడియాలో పెట్టినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

News February 9, 2025

కాళేశ్వర క్షేత్రం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించామని.. అందుకు తగ్గట్లుగా నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మహా కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, MLA గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఆయన మాట్లాడుతూ.. కాశీ, కేదార్‌నాథ్ కంటే ఈ క్షేత్రం ప్రాశస్త్యం కలదిగా పురాణాలు చెబుతున్నాయన్నారు.

News February 9, 2025

నవీపేట్: కెమెరాల పని తీరును పరిశీలించిన DIEO

image

రెండో దశ ప్రయోగ పరీక్షలు జరుగుతున్న నవీపేట్ మోడల్ జూనియర్ కళాశాల, నవోదయ జూనియర్ కళాశాలల్లో కెమెరాల పని తీరును నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవి కుమార్ ఆదివారం స్వయంగా పరిశీలించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో కెమెరాలకు జియో ట్యాగింగ్ ఉందా లేదా అని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెమరాలు ఆగిపోకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

error: Content is protected !!