News March 3, 2025

గణనీయంగా తగ్గిన గంజాయి సాగు: హోం మంత్రి

image

కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల కారణంగా రాష్ట్రంలో గంజాయి సాగు గణనీయంగా తగ్గిందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె సోమవారం సమాధానం ఇస్తూ 11,000 ఎకరాల నుంచి గంజాయి సాగు ప్రస్తుతం 100 ఎకరాలకు తగ్గిందన్నారు. గంజాయి సాగును పూర్తిగా నిర్వీర్యం చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు నియమించిన ఈగల్ టీం గంజాయి నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News December 17, 2025

మల్లంపల్లి సర్పంచ్‌గా రాములు

image

మల్హర్ మండలం మల్లంపల్లి సర్పంచ్‌గా జాడి రాములు 15 ఓట్లతో విజయం సాధించారు. జిల్లాలో అతి చిన్న పంచాయతీ అయిన మల్లంపల్లిలో 186 ఓట్లు ఉండగా 175 పోలయ్యాయి. దీంతో జాడి రాములు, పాలకుర్తి సురేందర్ ఇండిపెండెంట్లుగా బరిలో దిగారు. చివరకు సురేందర్‌పై జాడి రాములు సర్పంచ్‌గా విజయం సాధించారు. దీంతో గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు.

News December 17, 2025

టారిఫ్‌లను ఆయుధాల్లా మార్చారు: నిర్మల

image

అమెరికా, మెక్సికో టారిఫ్‌లపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పరోక్షంగా స్పందించారు. ‘సుంకాలు, ఇతర చర్యలతో ప్రపంచ వాణిజ్యం ఆయుధంలా మారుతోంది. భారత్ జాగ్రత్తగా సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది. మన ఆర్థిక వ్యవస్థ బలమే మనకు అదనపు ప్రయోజనం ఇస్తుంది’ అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం స్వేచ్ఛగా, న్యాయంగా లేదన్నారు. ఇండియాను టారిఫ్ కింగ్ అని, ఇప్పుడు టారిఫ్‌లనే ఆయుధాలుగా వాడుతున్నారని మండిపడ్డారు.

News December 17, 2025

BREAKING: సంగారెడ్డి జిల్లాలో తొలి ఫలితం

image

నాగలిగిద్ద మండలం శమా తండా సర్పంచిగా మారుతి మహారాజ్ విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మారుతి మహారాజ్ సమీప ప్రత్యర్థిపై 63 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తమకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు వారు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.