News February 25, 2026
గణపవరం: టెన్త్ అర్హతతో 200 ఉద్యోగాలకు జాబ్ మేళా

గణపవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 26న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.పి.నిర్మల కుమారి చెప్పారు. ఈ మేళాలో జీఎల్, పేటీయం, డెక్కన్ కెమికల్స్ తదితర కంపెనీల్లో 200లకు పైగా ఖాళీలు ఉన్నాయని, 2023,24,25,26 సంవత్సరాల్లో టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన 28 ఏళ్లు ఉన్నవారు అర్హులన్నారు. అభ్యర్థులు 26న (గురువారం) ఉదయం 10 గం.లకు డిగ్రీ కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరవ్వలన్నారు.
Similar News
News April 19, 2026
అనకాపల్లి: చందనోత్సవానికి ప్రత్యేక బస్సులు

సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అనకాపల్లి జిల్లా ప్రజా రవాణా అధికారిణి(ఆర్టీసీ) వి. ప్రవీణ తెలిపారు. డిపో నుంచి ఈనెల 20న తెల్లవారుజామున మూడు గంటల నుంచి 15 బస్సులు నడుపుతామన్నారు. ఈ బస్సులు రాత్రి వరకు తిరుగుతాయన్నారు.
News April 19, 2026
అక్షయ తృతీయ రోజు ఏం చెయ్యాలి?

అక్షయ తృతీయ (నేడు) పుణ్యాన్ని సంపాదించుకోవాల్సిన రోజని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్ర దినాన చేసే స్నానం, జపం, హోమం, దానాలు ‘అక్షయ’మైన (తరగని) ఫలితాలను ఇస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించేలా పేదలకు బట్టలు, గొడుగులు, చెప్పులు, చల్లని మజ్జిగ, నవధాన్యాలు దానం చేయడం విశేషమైన పుణ్యమని తెలుపుతున్నారు. ముఖ్యంగా నీటి కుండను దానం చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.
News April 19, 2026
MGU బీటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో బీటెక్ పరీక్షల షెడ్యూల్‌ను యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. సెమిస్టర్-2,4 (రెగ్యులర్ & బ్యాక్ లాగ్), సెమిస్టర్-1,3 (బ్యాక్ లాగ్) పరీక్షలు మే-5 నుంచి మే-21 మధ్య జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. టైం టేబుల్‌ను అధికారక ఎంజీయూ వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు.


