News January 28, 2025
గణితం ప్రశ్నల సంకలన దీపిక ఆవిష్కరించిన డీఈఓ

బొంతపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణితం ఉపాధ్యాయుడు ప్రసాద్ పదవ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన గణిత ప్రశ్నల సంకలన దీపికను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సంగారెడ్డిలోని కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. డీఈవో మాట్లాడుతూ.. ఈ దీపికను అన్ని పాఠశాలలకు పంపించాలని చెప్పారు. గణితంలో 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో DCEB కార్యదర్శి లింబాజి పాల్గొన్నారు.
Similar News
News November 17, 2025
ఒకేసారి రెండు సీక్వెల్స్‌లో తేజా సజ్జ!

హనుమాన్, మిరాయ్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిన తేజా సజ్జ మరో 2 చిత్రాలను లైన్లో పెట్టారు. జాంబిరెడ్డి, మిరాయ్ మూవీల సీక్వెల్స్‌ను సమాంతరంగా పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు సమాచారం. జనవరిలో జాంబిరెడ్డి-2, మార్చిలో మిరాయ్-2ను సెట్స్‌పైకి తీసుకెళ్తారని టాక్. ఈ సినిమాలను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది.
News November 17, 2025
అనకాపల్లిలో కాలుష్య నియంత్రణ మండలి ఆఫీసు: ఛైర్మన్

నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పని భారం తగ్గించేందుకు ప్రతి జిల్లా కేంద్రంలోనూ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు పీసీబీ ఛైర్మన్ పి.కృష్ణయ్య తెలిపారు. అనకాపల్లి, రాజమండ్రిలో కార్యాలయాలు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. విశాఖలో ఆదివారం మాట్లాడుతూ.. పరిశ్రమల పర్యవేక్షణతోపటు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే ఘటన స్థలానికి చేరుకునేలా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.
News November 17, 2025
ఏపీలో అణువిద్యుత్ ప్రాజెక్ట్.. పరిశీలిస్తున్న NTPC!

విద్యుదుత్పత్తి సంస్థ NTPC 700, 1000, 1,600 మెగావాట్ల కెపాసిటీతో అణువిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం AP, గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో అనువైన ప్రదేశాలను అన్వేషిస్తున్నట్లు సంస్థ అధికారి ఒకరు వెల్లడించారు. 2047 నాటికి 30K మె.వా. విద్యుత్ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వెయ్యి మెగావాట్ల ప్లాంట్‌కు రూ.20వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా.


