News January 28, 2025
గణితం ప్రశ్నల సంకలన దీపిక ఆవిష్కరించిన డీఈఓ

బొంతపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణితం ఉపాధ్యాయుడు ప్రసాద్ పదవ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన గణిత ప్రశ్నల సంకలన దీపికను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సంగారెడ్డిలోని కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. డీఈవో మాట్లాడుతూ.. ఈ దీపికను అన్ని పాఠశాలలకు పంపించాలని చెప్పారు. గణితంలో 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో DCEB కార్యదర్శి లింబాజి పాల్గొన్నారు.
Similar News
News April 12, 2026
VZM: పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. యువకుడి మృతి

ట్రాక్టర్ పైనుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందినట్లు సీఐ కె.నారాయణరావు చెప్పారు. ఆడారి వంశీ(28) పార్వతీపురం (M) కారాడవలస నుంచి బొబ్బిలి మండలం డొంగురువలస పెళ్లికి శుక్రవారం రాత్రి వచ్చాడు. ట్రాక్టర్‌పై తిరిగి వెళ్తుండగా మితిమీరిన వేగంతో నడపడం వల్ల తొట్టెలో ఉన్న వంశీ జారిపడ్డాడు. తీవ్రంగా గాయపడిన వంశీ శనివారం మృతి చెందాడు. అతని తండ్రి తవిటన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.
News April 12, 2026
సింహాచలం: రేపటి నుంచి చందనోత్సవం టికెట్లు.. ఇలా బుక్ చేసుకోండి

సింహాచలంలో ఈనెల 20న చందనోత్సవం జరగనుంది. స్వామి వారి నిజరూప దర్శనం కోసం ఈనెల 13-17 వరకు టికెట్లను విక్రయించనున్నారు. రూ.300, రూ.1000 దర్శన టికెట్లను అక్కయ్యపాలెం, సింహాచలం యూనియన్ బ్యాంక్, సింహాచలం, బిర్లా జంక్షన్ శాఖ SBIలో అమ్మనున్నారు. https://chandanotsavam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి తెలిపారు.
News April 12, 2026
నిజామాబాద్ జిల్లా రైతులకు మంత్రి ఉత్తమ్ శుభవార్త

నిజామాబాద్ జిల్లా రైతులకు భారీ ఊతమిచ్చే జకోరా, చందూర్, చింతకుంట లిఫ్ట్ ఇరిగేషన్ పథకం తుదిదశకు చేరుకుంది. ఈ పథకాన్ని త్వరలో ప్రారంభించి ఖరీఫ్ సీజన్‌కు ముందే సాగునీరు అందించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రూ.106.04 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా వర్ని, చందూర్, మోస్రాలోని 7,975 ఎకరాలకు సాగునీరు అందనుంది. బాన్సువాడ నియోజకవర్గ రైతులకు ఈ పథకం ఎక్కువ మేలు చేకూర్చనుంది.


