News September 11, 2024
గణేశుడి లడ్డూను పాడిన ముస్లిం సోదరులు

ప్రకాశం జిల్లాలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజార్ వద్ద వినాయకుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా గణనాథుడి లడ్డూను వేలం వేశారు. ముస్లిం సోదరులు షరీఫ్, నజీర్ రూ.33800లకు లడ్డూను దక్కించుకున్నారు. మతసామరస్యానికి ఇది నిదర్శనమని పలువురు వారిని అభినందించారు.
Similar News
News September 18, 2025
ప్రకాశం ఎస్పీ గారూ.. ప్లీజ్ ఈవ్ టీజింగ్పై లుక్కేయండి!

ప్రకాశం జిల్లా నూతన SP హర్షవర్ధన్ రాజు ఇటీవల బాధ్యతలు చేపట్టారు. తిరుపతిలో SPగా ఉన్నప్పుడు ఈవ్ టీజింగ్పై ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు ప్రకాశంలో కూడా అదే తీరు చూపాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. స్కూల్స్, కళాశాలలు మొదలు, ముగిసే సమయాల్లో పోకిరీల ఆగడాలు పెరిగాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. SP చొరవ తీసుకోవాలని వారు కోరారు.
News September 18, 2025
ఇవాళ ప్రకాశం జిల్లాకు భారీ వర్ష సూచన

ప్రకాశం జిల్లాకు గురువారం సైతం మోస్తారు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం సాయంత్రం ప్రకటించింది. కాగా బుధవారం ప్రకాశం జిల్లాలోని పలు మండలాలలో జోరు వానలు కురిసిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఒంగోలులో బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గురువారం కూడా వర్ష సూచన ఉండడంతో, ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.
News September 17, 2025
ప్రకాశం: ఐటీఐ పాసైన విద్యార్థులకు గుడ్ న్యూస్

జిల్లాలో ఐటీఐ పాసైన విద్యార్థులకు జిల్లా ఐటీఐ కన్వీనర్ ప్రసాద్ బాబు శుభవార్త చెప్పారు. జిల్లాలోని ఆర్టీసీ డిపోలలో అప్రెంటిస్ శిక్షణలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 4వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటించారు. జిల్లాలో మొత్తం 54 ఖాళీలు ఉన్నాయన్నారు.