News September 9, 2024

గణేశ్ ఉత్సవాలలో అపశ్రుతి.. గుండెపోటుతో యువకుడి మృతి

image

గణేశ్ ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆళ్లగడ్డలోని ఆశ్రమం వీధిలో ఉన్న గంగమ్మ దేవాలయం వద్ద ఆదివారం రాత్రి అశోక్(32) అనే యువకుడు డాన్స్ వేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆశ్రమం వీధిలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Similar News

News October 10, 2024

కర్నూలు: దాడి ఘటనలో 24 మందిపై మరో కేసు

image

కర్నూలు (D) ఆలూరు నియోజకవర్గంలోని రెన్యూ విండ్‌ పవర్‌, గ్రీన్‌ ఇన్‌ఫ్రా కంపెనీల కార్యాలయాలపై దాడులకు పాల్పడిన 24మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు రిమాండ్ విధించగా ప్రస్తుతం ఆదోని సబ్ జైలులో ఉన్నారు. వీరిపై ఆస్పరి, ఆలూరు పోలీస్ స్టేషన్లలో ఒక్కో కేసు నమోదు కాగా తాజాగా దేవనకొండ పీఎస్‌లో మరో కేసు నమోదైంది. ఈ ఘటనలో MLA విరూపాక్షి సోదరుడు వెంకటేశ్వర్లు ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

News October 10, 2024

కర్నూలు: నేటి నుంచే యూనివర్సిటీకి దసరా సెలవులు

image

కర్నూలు రాయలసీమ యూనివర్సిటీకి నేటి నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం వర్కింగ్ డే ఉన్నప్పటికీ నాన్ టీచింగ్ ఉద్యోగుల అభ్యర్థన మేరకు వైస్ ఛాన్స్‌లర్ సెలవు ఇస్తూ ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు రిజిస్ట్రార్ తెలిపారు.

News October 10, 2024

భారతదేశం ఓ గొప్ప కుమారుడిని కోల్పోయింది: MP శబరి

image

టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతిపై నంద్యాల MP డా.బైరెడ్డి శబరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘రతన్ టాటా దేశానికి అందించిన సేవలు ఎనలేనివి. నైతిక వ్యాపార పద్ధతుల పట్ల ఆయనకున్న తిరుగులేని నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భారతదేశం ఓ గొప్ప కుమారుడిని కోల్పోయింది’ అని ట్వీట్ పేర్కొన్నారు.