News August 28, 2024
గణేశ్ మండపాలకు అనుమతులు తప్పనిసరి: కలెక్టర్
గణేశ్ విగ్రహ నిమజ్జన మహోత్సవ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా శాంతియుత వాతావరణంలో వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై ఎస్పీ, జేసీతో కలిసి సమావేశం నిర్వహించారు. విగ్రహ మండపం ఏర్పాట్లకు అనుమతులు తప్పనిసరి ఆమె అన్నారు.
Similar News
News September 21, 2024
విద్యార్థుల మంచి మనసు.. నంద్యాల కలెక్టర్‌కు విరాళం అందజేత
విద్యార్థులు తాము దాచుకున్న పాకెట్ మనీని వరద బాధితుల సహాయార్థం అందించడం అభినందనీయమని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ మూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులు ఇచ్చిన రూ.11,675ల మొత్తాన్ని శుక్రవారం కలెక్టర్ రాజకుమారికి అందించారు. ఉన్నతాధికారులు విద్యార్థులను అభినందించారు.
News September 21, 2024
విద్యార్థుల మంచి మనసు.. నంద్యాల కలెక్టర్‌కు విరాళం అందజేత
విద్యార్థులు తాము దాచుకున్న పాకెట్ మనీని వరద బాధితుల సహాయార్థం అందించడం అభినందనీయమని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. జూపాడుబంగ్లా మండలంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ మూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులు దాచుకున్న రూ.11,675 చెక్కును శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజకుమారికి అందించారు. ఉన్నతాధికారులు విద్యార్థులను అభినందించారు.
News September 20, 2024
587 మొబైల్స్ రికవరీ: ఎస్పీ
కర్నూలు జిల్లా పరిధిలో రూ.1,33,70,000 విలువ చేసే 587 మొబైల్స్‌ను ఎస్పీ బిందు మాధవ్ బాధితులకు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. మొబైల్ పోగొట్టుకున్న వారికి రికవరీ చేసి అందజేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఎలాంటి రుసుము లేకుండా అందజేశామన్నారు. పోలీస్ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.