News August 31, 2024
గణేశ్ మండపాల అనుమతులకు ప్రత్యేక వెబ్ సైట్: మంత్రి లోకేశ్
ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరగబోతున్న వినాయక చతుర్థి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసుకునే గణేశ్ మండపాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతుల కోసం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించామని చెప్పారు. https://ganeshutsav.net ద్వారా మండపాల ఏర్పాటుకు అనుమతులన్నీ సింగిల్ విండో విధానంలో ఇచ్చేలా చేశామని Xలో పోస్ట్ చేశారు.
Similar News
News September 9, 2024
మంగళగిరి: ప్రజా వేదిక వారం రోజులు రద్దు
అకాల వర్షాల కారణంగా మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో జరగాల్సిన ప్రజా వేదిక కార్యక్రమం వారం రోజుల పాటు రద్దు అయినట్లు కార్యాలయ కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు తెలిపారు. అకాల వర్షాలు, వరదలు కారణంగా అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉండటంతో మంగళగిరి టీడీపీ పార్టీ కేంద్ర కార్యలయంలో జరగాల్సిన ప్రజా వేదిక కార్యక్రమం ఇవన్నీ ఈనెల 9 నుంచి 15 వరకు రద్దు అయినట్లు తెలిపారు.
News September 8, 2024
మంగళగిరి: ప్రజా వేదిక వారం రోజులు రద్దు
అకాల వర్షాల కారణంగా మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో జరగాల్సిన ప్రజా వేదిక” కార్యక్రమం వారం రోజుల పాటు రద్దు అయినట్లు కార్యాలయ కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు తెలిపారు. అకాల వర్షాలు, వరదలు కారణంగా అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉండటంతో మంగళగిరి టీడీపీ పార్టీ కేంద్ర కార్యలయంలో జరగాల్సిన “ప్రజా వేదిక” కార్యక్రమం ఇవన్నీ ఈనెల 9 నుంచి 15 వరకు రద్దు అయినట్లు తెలిపారు.
News September 8, 2024
గుంటూరు: ప్రజా సమస్యల పరిష్కార రద్దు
కలెక్టరేట్లో సోమవారం నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు పరిచినట్లు గుంటూరు కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి IAS ఆదివారం తెలిపారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.