News September 13, 2024
గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ బందోబస్త్ ఏర్పాట్లపై నగర సీపీ సమీక్ష

HYD సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం సౌత్ ఈస్ట్ & ఈస్ట్ జోన్లలో పర్యటించారు. ఈనెల 17న జరగనున్న గణేశ్ నిమజ్జనం, 19న జరగనున్న మిలాద్ ఉన్ నబీ బందోబస్త్ ఏర్పాట్ల గురించి పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలీస్ అధికారులు మానసికంగా ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించి శాంతి భద్రతలు కాపాడాలని అన్నారు. అలాగే వేడుకల్లో భాగంగా ట్రాఫిక్ సమస్యను నియంత్రించడం గురించి పలు సూచనలు చేశారు.
Similar News
News October 13, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తొలిరోజు 11 నామినేషన్లు

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తొలి రోజు నామినేషన్లు ముగిశాయి. మొత్తం పది మంది 11 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. స్వతంత్రులు సిలివేరు శ్రీకాంత్, పెసరికాయల పరీక్షిత్ రెడ్డి, చంద్రశేఖర్, పూసా శ్రీనివాస్, వేముల విక్రమ్ రెడ్డి, ఇబ్రహీంఖాన్, ఆరావల్లి శ్రీనివాసరావు, సయ్యద్ ముస్తఫా హుస్సేన్, సల్మాన్ ఖాన్, సపావత్ సుమన్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నవంబర్ 11న జరగనుంది.
News October 13, 2025
BREAKING: HYD: కత్తితో బెదిరించి బాలుడిపై లైంగిక దాడి

HYDలో అబ్బాయిలపై లైంగిక దాడుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. సైదాబాద్ జువైనల్ హోమ్ ఘటన మరువక ముందే తాజాగా బండ్లగూడలో మరో ఘటన చోటు చేసుకుంది. బండ్లగూడ PS పరిధిలో కత్తితో బెదిరించి నాలుగో తరగతి చదువుతున్న బాలుడిపై గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడి చేశాడు. నొప్పితో బాధపడుతున్న బాలుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
News October 13, 2025
HYD: ఖైదీల సంక్షేమంలో చర్లపల్లి జైలు నంబర్ వన్!

చర్లపల్లి జైలును ఈరోజు సందర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఖైదీల సంక్షేమంలో చర్లపల్లి జైలు దేశానికి ఆదర్శమన్నారు. ఖైదీలకు బీమా, కుటుంబ సభ్యులకు వడ్డీలేని రుణ సదుపాయం కల్పించడం అభినందనీయమని ప్రశంసించారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా విజన్ అద్భుతమని, ఖైదీల ఉత్పత్తులతో ప్రత్యేక మేళా నిర్వహించాలని సూచించారు.