News September 13, 2024
గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ బందోబస్త్ ఏర్పాట్లపై నగర సీపీ సమీక్ష
HYD సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం సౌత్ ఈస్ట్ & ఈస్ట్ జోన్లలో పర్యటించారు. ఈనెల 17న జరగనున్న గణేశ్ నిమజ్జనం, 19న జరగనున్న మిలాద్ ఉన్ నబీ బందోబస్త్ ఏర్పాట్ల గురించి పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలీస్ అధికారులు మానసికంగా ఒత్తిడి లేకుండా విధులు నిర్వహించి శాంతి భద్రతలు కాపాడాలని అన్నారు. అలాగే వేడుకల్లో భాగంగా ట్రాఫిక్ సమస్యను నియంత్రించడం గురించి పలు సూచనలు చేశారు.
Similar News
News October 15, 2024
HYD: ఈ నెల 22న కలెక్టరేట్‌ల ముట్టడికి పిలుపు
విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేదీన జిల్లా కలెక్టరేట్‌లు, మండల తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. సోమవారం కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణతో కలిసి సమావేశమయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలన్నారు.
News October 14, 2024
HYD: రాడార్ ఏర్పాటుకు BRS వ్యతిరేకం: KTR
ఓ వైపు మూసీ నదికి CM మరణశాసనం రాస్తూ.. మరోవైపు సుందరీకరణ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తారా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. 10 ఏళ్ల పాలనలో తమపై రాడార్ స్టేషన్ నిర్మాణానికి ఎంత ఒత్తిడి తెచ్చినా అంగీకరించలేదని, జనావాసాలు లేని ద్వీపాల్లో ఏర్పాటు చేయాల్సిన రాడార్‌ను తెలంగాణలో ఏర్పాటు చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పర్యావరణవేత్తలతో కలిసి BRS పోరాటం చేస్తుందన్నారు.
News October 14, 2024
HYD: విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: ఈటల
సికింద్రాబాద్‌లో <<14353764>>ముత్యాలమ్మ విగ్రహాన్ని<<>> ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని BJP మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. దాడిచేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తులు, శక్తులపట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే జరిగే పరిణామాలకు రేవంత్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.