News September 15, 2024

గణేష్ మండపాలను దర్శించుకున్న ఎమ్మెల్యే ధన్పాల్

image

గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ నగరంలో పలు గణేష్ మండపాలను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని కోరుకున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 4, 2025

NZB: 6,568 మంది రైతులకు రూ.30.80 కోట్ల బోనస్ చెల్లింపు

image

వానకాలం సీజన్‌కు సంబంధించిన NZB జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన 6,568 మంది రైతులకు రూ.30.80 కోట్లు బోనస్ చెల్లించినట్లు DSO అరవింద్ రెడ్డి తెలిపారు. ఈ రైతుల 6,16,110 క్వింటాళ్లకు సంబంధించి రూ.500 చొప్పున బోనస్ చెల్లించామన్నారు. జిల్లాలోని 487 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,90,616 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు ఆయన వివరించారు.

News November 3, 2025

NZB: ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీలపై DM&HO సమీక్ష

image

నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు ఆసుపత్రిని తనిఖీ చేసే బృందాలు నిర్వహించే విధులపై DM&HO డాక్టర్ బి రాజశ్రీ సోమవారం సమీక్ష జరిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో తనిఖీ బృందాలుగా ఆసుపత్రిలో తనిఖీకి వెళ్ళినప్పుడు ఏమేమి చూడాలి, ఫామ్ ఎఫ్‌ను ఏ విధంగా ఆడిట్ చేయాలి, అక్కడ రిజిస్టర్లను ఏ విధంగా చెక్ చేయాలి, ఏ రకమైన పద్ధతులను అవలంబించాలి మొదలగు విషయాలపై వైద్యులకు అవగాహన కలిగించారు.

News November 2, 2025

NZB: 77 కిలోల వెండి చోరీ

image

నిజామాబాద్‌లోని వన్ టౌన్ పరిధిలో ఓ సిల్వర్ మర్చంట్ షాపులో 77 KGల వెండి చోరీ అయ్యింది. నగరానికి చెందిన ఇద్దరు సిల్వర్ మర్చంట్‌లో 6 నెలలుగా పని చేస్తున్నారు. వారు షాప్‌లో నుంచి వెండిని విడతల వారీగా చోరీ చేశారు. ఇటీవల వారిని షాప్ యజమాని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో 4 KGల వెండిని తిరిగి ఇచ్చినట్లు సమాచారం. మిగతా 73 KGల వెండి తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు వన్ టౌన్‌లో ఫిర్యాదు చేశాడు.